LIC: ఎల్‌ఐసీ పాలసీదారులకి గమనిక.. కచ్చితంగా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి..!

LIC: భారతదేశంలోనే అతి పెద్ద బీమా సంస్థ అయిన లైఫ్ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్ ఆఫ్‌ ఇండియా...

Update: 2022-03-17 06:22 GMT

LIC: ఎల్‌ఐసీ పాలసీదారులకి గమనిక.. కచ్చితంగా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి..!

LIC: భారతదేశంలోనే అతి పెద్ద బీమా సంస్థ అయిన లైఫ్ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్ ఆఫ్‌ ఇండియా (LIC) పాలసీ దారులకి బంపర్ ఆఫర్ ప్రకటించింది. లాప్స్ అయిన పాలసీల పునరుద్ధరణ కోసం అవకాశం కల్పిస్తోంది. దీనివల్ల పాలసీదారులు డబ్బులు లేక కట్టలేకపోయిన పాలసీలను పునరుద్దరించుకోవచ్చు. ఫిబ్రవరి 7 నుండి మార్చి 25 వరకు ఈ అవకాశాన్ని కల్పిస్తోంది. పాలసీదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటే ఎల్‌ఐసీ భద్రత మళ్లీ మీకు లభిస్తుంది.

ప్రీమియంలో డిఫాల్ట్ తేదీ 5 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు. అంటే మీరు మొదటి ప్రీమియం చెల్లింపులో డిఫాల్ట్ అయిన 5 సంవత్సరాలలోపు పాలసీని పునరుద్ధరించవచ్చు. టర్మ్ ఇన్సూరెన్స్, మల్టిపుల్ రిస్క్ పాలసీలు మొదలైన అధిక రిస్క్ ప్లాన్‌ల విషయంలో ఆలస్య రుసుము మినహాయింపు ఉండదు. ఈ పథకం కింద రూ.1 లక్ష ప్రీమియంతో సంప్రదాయ, ఆరోగ్య బీమా ఆలస్య రుసుముపై 20 శాతం లేదా గరిష్టంగా రూ. 2 వేలు రాయితీ ఇస్తుంది.

అదే సమయంలో రూ.1 లక్ష నుంచి రూ. 3 లక్షల ప్రీమియం వరకు పాలసీ ఆలస్య రుసుముపై 25 శాతం లేదా గరిష్టంగా రూ. 2,500 తగ్గింపు ఉంటుంది. ఇది కాకుండా, రూ.3 లక్షల కంటే ఎక్కువ ప్రీమియంతో పాలసీ ఆలస్య రుసుముపై 30 శాతం లేదా గరిష్టంగా రూ.3000 తగ్గింపు లభిస్తుంది. మైక్రో ఇన్సూరెన్స్ పాలసీల విషయంలో, ఆలస్య రుసుములలో 100 శాతం మినహాయింపు ఉంటుంది. ప్రస్తుత కోవిడ్-19 మహమ్మారి దృష్ట్యా LIC పాలసీదారులకు వారి పాలసీలను పునరుద్ధరించడానికి వారి కుటుంబానికి ఆర్థిక భద్రతను కల్పించడానికి ఇది ఒక మంచి అవకాశం అని ఎల్‌ఐసీ తెలిపింది.

Tags:    

Similar News