LIC New Policy: ఎల్‌ఐసీ నుంచి సరికొత్త ప్లాన్‌.. ప్లాన్‌ వివరాలు, ప్రయోజనాలు తెలుసుకోండి..!

LIC New Policy: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ) దేశంలోనే అతిపెద్ద జీవిత బీమా సంస్థ.

Update: 2024-02-06 11:30 GMT

LIC New Policy: ఎల్‌ఐసీ నుంచి సరికొత్త ప్లాన్‌.. ప్లాన్‌ వివరాలు, ప్రయోజనాలు తెలుసుకోండి..!

LIC New Policy: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ) దేశంలోనే అతిపెద్ద జీవిత బీమా సంస్థ. దేశంలోనే అత్యధిక కస్టమర్లు, ఏజెంట్లను కలిగిన సంస్థ. ఇప్పటికే చాలామంది ఇందులో ఇన్వెస్ట్‌ చేశారు. ఎల్‌ఐసీ అన్ని వర్గాల వారికి సరిపోయే జీవిత బీమా పాలసీలను రూపొందిస్తుంది. వీటివల్ల చాలామంది లబ్ధి పొందుతున్నారు. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడకుండా ఆదుకుంటోంది. అలాంటి సంస్థ తాజాగా మరో కొత్త పాలసీని ప్రవేశపెట్టింది. దాని గురించి ఈ రోజు వివరంగా తెలుసుకుందాం.

ఎల్‌ఐసీ కొత్త పాలసీ పేరు 'ఇండెక్స్ ప్లస్'. ఈ పాలసీ యూనిట్ లింక్ చేయడం వల్ల ప్రజలు మెరుగైన రాబడిని, జీవిత బీమా ప్రయోజనాన్ని పొందుతారు. ఫిబ్రవరి 6 నుంచి ఈ పాలసీలో పెట్టుబడులు పెట్టవచ్చు. ఇందులో రెగ్యులర్ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఇది నాన్-పార్టిసిటింగ్ వ్యక్తిగత బీమా ప్లాన్. కేవలం భారతీయ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రారంభించారు. ఈ పాలసీలో వ్యక్తులు జీవిత బీమా, పొదుపు రెండింటి సౌకర్యాన్ని పొందుతారు.

ఈ పాలసీలో వార్షిక ప్రీమియంలో కొంత భాగం యూనిట్ ఫండ్‌లో జమ చేస్తారు. ఇది యూనిట్లను కొనుగోలు చేయడానికి ఉపయోగిస్తారు. ఈ మొత్తాన్ని పెట్టుబడి పెట్టిన యూనిట్ ఫండ్‌లో హామీతో కూడిన రాబడిని పొందుతారు. ఇది పాలసీ నిర్దిష్ట వ్యవధిని పూర్తి చేసిన తర్వాత వస్తుంది. అయితే 5 సంవత్సరాల 'లాక్-ఇన్' వ్యవధిని పూర్తి చేసిన తర్వాత మీరు ఎప్పుడైనా యూనిట్లలో కొంత భాగాన్ని రీడీమ్ చేయగలరు. ఇది కొన్ని షరతులపై ఆధారపడి ఉంటుంది.

ఎల్‌ఐసీ ఇండెక్స్ ప్లస్ పాలసీని 90 రోజుల వయస్సు ఉన్న పిల్లల పేరు మీద కూడా కొనుగోలు చేయవచ్చు. దీనిలో ప్రవేశించడానికి గరిష్ట వయస్సు 50 లేదా 60 సంవత్సరాలు. పాలసీ మెచ్యూరిటీకి కనీస వయస్సు 18 సంవత్సరాలు. గరిష్ట వయస్సు 75 సంవత్సరాల నుంచి 85 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇందులో బేసిక్‌ బీమా మొత్తం ద్వారా ప్రీమియం నిర్ణయిస్తారు. మీ వార్షిక ప్రీమియమ్‌కి బేసిక్‌ హామీ మొత్తం 7 నుంచి 10 రెట్లు ఉండేలా లెక్కింపు ఉంటుంది.

కస్టమర్లు ప్రీమియంను నెలవారీ నుంచి వార్షిక ప్రాతిపదికన చెల్లించే వెసులుబాటు ఉంటుంది. ఇందులో వార్షిక ప్రీమియం రేంజ్ దాదాపు రూ.30,000 వరకు ఉంటుంది. ఈ పాలసీకి కనిష్ట మెచ్యూరిటీ వ్యవధి 10 సంవత్సరాలు, గరిష్ట మెచ్యూరిటీ వ్యవధి 25 సంవత్సరాలు. దీనిలో యూనిట్ ఫండ్‌ను ఎక్కడ పెట్టుబడి పెట్టాలనే దాని కోసం మీరు 2 ఆప్షన్స్‌ పొందుతారు. ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్ లేదా ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్ ఎంచుకోవచ్చు.

పెట్టుబడులు వరుసగా NSE నిఫ్టీ 100 ఇండెక్స్ లేదా NSE నిఫ్టీ 50 ఇండెక్స్‌లో చేస్తారు. పాలసీ మెచ్యూరిటీ తర్వాత యూనిట్ ఫండ్ విలువకు సమానమైన మొత్తం ప్రజలకు తిరిగి చెల్లిస్తారు. పాలసీ వ్యవధిలో వ్యక్తి మరణిస్తే అతడి కుటుంబానికి హామీ మొత్తం, బోనస్ చెల్లిస్తారు. ప్రజలు ఈ పాలసీతో యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రైడర్‌ని కూడా తీసుకోవచ్చు.

Tags:    

Similar News