LIC Policy: ఎల్‌ఐసీ అద్భుత పాలసీ.. పిల్లల చదువు కోసం 10 లక్షల రూపాయలు..!

LIC Policy: ఎల్‌ఐసీ దేశంలోనే అతిపెద్ద జీవిత బీమా సంస్థ. ఇది పేద, ధనిక వర్గం లేకుండా చిన్నాపెద్దా లేకుండా అన్ని వర్గాల వారికి అనువైన పాలసీలని రూపొందిస్తుంది.

Update: 2023-05-29 14:00 GMT

LIC Policy: ఎల్‌ఐసీ అద్భుత పాలసీ.. పిల్లల చదువు కోసం 10 లక్షల రూపాయలు..!

LIC Policy: ఎల్‌ఐసీ దేశంలోనే అతిపెద్ద జీవిత బీమా సంస్థ. ఇది పేద, ధనిక వర్గం లేకుండా చిన్నాపెద్దా లేకుండా అన్ని వర్గాల వారికి అనువైన పాలసీలని రూపొందిస్తుంది. అయితే పిల్లల చదువు, భవిష్యత్‌ కోసం కూడా ఒక అద్భుతమైన పాలసీని రూపొందించింది. దీనిపేరు ఎల్‌ఐసీ న్యూ చిల్డ్రన్ మనీ బ్యాక్ పాలసీ. ఇందులో పిల్లల పేరుపై మంచి ఫండ్‌ని క్రియేట్‌ చేయవచ్చు. దీని ప్రత్యేకత ఏంటంటే 0 నుంచి 12 సంవత్సరాల పిల్లలకు తీసుకోవచ్చు. ఈ పాలసీ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

కొత్త చిల్డ్రన్స్ మనీ బ్యాక్ ప్లాన్‌ పాలసీని 25 ఏళ్ల పాటు తీసుకోవచ్చు. ఇందులో వాయిదాలలో డబ్బు లభిస్తుంది. మీ బిడ్డకు 18 సంవత్సరాలు నిండినప్పుడు అతను మొదటిసారిగా కొంత డబ్బుని పొందుతాడు. 20 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు రెండోసారి, 22 సంవత్సరాల వయస్సులో మూడవసారి డబ్బు పొందుతాడు. ఈ పాలసీని ఆన్‌లైన్‌లో లేదా ఏజెంట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. పాలసీదారుడు పిల్లల వయస్సు, గుర్తింపు రుజువుతో పాటు అతని/ఆమె సొంత చిరునామాని అందించాలి.

ఈ పథకంలో 0 నుంచి 12 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లల తరపున తల్లిదండ్రులు తీసుకోవచ్చు. కనీసం రూ.10,00,000 బీమా తీసుకోవచ్చు. ఈ పథకంలో ఒక వ్యక్తి 20 సంవత్సరాల పాలసీ వ్యవధితో LIC కొత్త చిల్డ్రన్ మనీ బ్యాక్ ప్లాన్‌ని ఎంచుకుని సంవత్సరంలో 30,000 చెల్లిస్తాడు. మెచ్యూరిటీపై మొత్తం రూ.10,00,000 పొందుతాడు. డెత్ బెనిఫిట్ గురించి మాట్లాడితే పాలసీ సమయంలో పిల్లవాడు చనిపోతే తల్లిదండ్రులకు సమ్ అష్యూర్డ్, బోనస్ లభిస్తుంది.

పాలసీ తీసుకున్న తర్వాత నచ్చకపోతే 15 రోజుల్లో వెనక్కి తీసుకునే అవకాశం ఉంది. ఈ పాలసీపై రుణ సదుపాయం కూడా లభిస్తుంది. ఇక ప్రీమియం పేమెంట్ ఆలస్యం అయితే 15 రోజుల గ్రేస్ పీరియడ్ కూడా ఉంటుంది. ఎల్ఐసీ ప్రీమియం వేవర్ బెనిఫిట్ రైడర్ తీసుకుంటే పాలసీ తీసుకున్న వ్యక్తి ప్రీమియం చెల్లిస్తున్న కాలంలో మరణిస్తే ఆ తర్వాత చెల్లించాల్సిన ప్రీమియంలను మాఫీ చేస్తుంది. పాలసీకి రైడర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. పాలసీ మూడేళ్లు పూర్తైన తర్వాత సరెండర్ చేయొచ్చు. సెక్షన్ 80సీ కింద టాక్స్ మినయింపు లభిస్తుంది.

Tags:    

Similar News