LIC Pension Plan: 40 ఏళ్ల వయసుకే పెన్షన్.. ప్రతినెలా 12000..!

LIC Pension Plan: 40 ఏళ్ల వయసుకే పెన్షన్.. ప్రతినెలా 12000..!

Update: 2022-09-03 06:00 GMT

LIC Pension Plan: 40 ఏళ్ల వయసుకే పెన్షన్.. ప్రతినెలా 12000..!

LIC Pension Plan: మీరు 40 సంవత్సరాల వయస్సు నుంచే పెన్షన్ తీసుకోవాలనుకుంటే ఈ పాలసీ బాగా ఉపయోగపడుతుంది. ఎల్‌ఐసీ అందించే ఈ పథకంలో ఒక్కసారి పెట్టుబడి పెడితే చాలు. ఆ తర్వాత పింఛను పొందడం ప్రారంభమవుతుంది. ఈ ప్రత్యేక పథకం పేరు ఎల్‌ఐసీ సరళ్ పెన్షన్ యోజన. ఈ రోజు ఈ పథకం గురించి వివరంగా తెలుసుకుందాం.

ఎల్‌ఐసీ సరళ్‌ పెన్షన్‌ యోజనలో ఒకసారి ప్రీమియం చెల్లించాలి. ఆ తర్వాత మీరు జీవితాంతం పెన్షన్ పొందుతూనే ఉంటారు. పాలసీదారు మరణిస్తే పెట్టుబడి మొత్తం అతని/ఆమె నామినీకి చెల్లిస్తారు. ఈ ప్లాన్ ప్రత్యేకత ఏంటంటే ఇది జీవితాంతం ఒకే విధమైన రాబడిని ఉంటుంది. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడానికి కనీస వయస్సు 40 సంవత్సరాలు గరిష్ట వయస్సు 80 సంవత్సరాలు. ఒక వ్యక్తి ఈ పథకాన్ని ఒంటరిగా కొనుగోలు చేయవచ్చు లేదా భార్యాభర్తలతో కలిసి పెట్టుబడి పెట్టవచ్చు. పాలసీదారులు 6 నెలల తర్వాత ఎప్పుడైనా ఈ పాలసీని సరెండర్ చేయవచ్చు.

ఎల్‌ఐసి సరళ్ పెన్షన్ యోజనలో పెన్షన్ తీసుకోవడానికి నాలుగు ఎంపికలు ఉన్నాయి. కస్టమర్లు నెలవారీ, త్రైమాసికం, అర్ధ సంవత్సరం లేదా వార్షిక పెన్షన్ తీసుకోవచ్చు. ఇందులో నెలవారీ పెన్షన్ కనీసం రూ.1000, త్రైమాసిక పింఛను కనిష్టంగా రూ.3,000, అర్ధ వార్షిక పింఛను కనిష్టంగా రూ.6,000, వార్షిక పెన్షన్ కనీసం రూ.12,000. ఈ పథకంలో గరిష్ట పెన్షన్ మొత్తంపై పరిమితి లేదు. ఉదాహరణకు మీరు 42 సంవత్సరాల వయస్సులో రూ.20 లక్షల యాన్యుటీని కొనుగోలు చేస్తే మీకు నెలవారీ పెన్షన్ రూ.12,388 చెల్లిస్తారు.

6 నెలల తర్వాత రుణ సౌకర్యం

ఈ పథకంలో రుణ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. పథకం కొనుగోలు చేసిన ఆరు నెలల తర్వాత కస్టమర్ రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది కాకుండా మీకు ఏదైనా వ్యాధి చికిత్స కోసం డబ్బు అవసరమైతే పాలసీలో డిపాజిట్ చేసిన డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే పాలసీని సరెండర్ చేసినప్పుడు కస్టమర్ బేస్ ధరలో 95% తిరిగి పొందుతారని గుర్తుంచుకోండి.

Tags:    

Similar News