LIC: ఎల్‌ఐసీ నుంచి మరో కొత్త పాలసీ.. సూపర్ బెనిఫిట్స్‌..!

LIC: ఎల్‌ఐసీ నుంచి మరో కొత్త పాలసీ.. సూపర్ బెనిఫిట్స్‌..!

Update: 2022-06-18 09:30 GMT

LIC: ఎల్‌ఐసీ నుంచి మరో కొత్త పాలసీ.. సూపర్ బెనిఫిట్స్‌..!

LIC: ఎల్‌ఐసి వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్లని అందిస్తూనే ఉంటుంది. తాజాగా ధన్ సంచయ్ సేవింగ్ ప్లాన్ అనే కొత్త పాలసీని ప్రారంభించింది. జూన్ 14న దీనిని ప్రారంభించింది. ఎల్‌ఐసి ధన్ సంచయ్ పాలసీ కింద పాలసీదారు మరణించినప్పుడు పాలసీ వ్యవధిలో కుటుంబానికి ఆర్థిక సహాయం అందుతుంది. ఇది మాత్రమే కాదు ఇది పాలసీ మెచ్యూరిటీ తర్వాత చెల్లింపు వ్యవధిలో గ్యారెంటీ ఆదాయాన్ని అందిస్తుంది. ఆ వివరాలు తెలుసుకుందాం.

ఎల్‌ఐసీ అందించిన సమాచారం ప్రకారం.. ఈ నిర్దిష్ట పాలసీలో ప్లాన్ మెచ్యూరిటీ తేదీ తర్వాత చెల్లింపు సమయంలో హామీ ఇచ్చిన ప్రయోజనాలు అందుతాయి. అంతేకాక హామీతో కూడిన టెర్మినల్ ప్రయోజనాలు కూడా చెల్లిస్తారు. ఈ ప్లాన్ 5 సంవత్సరాల నుంచి గరిష్టంగా 15 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇది స్థిర ఆదాయ ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులో లోన్ లేన్ సౌకర్యం కూడా ఉంటుంది. మీరు రైడర్లను కూడా కొనుగోలు చేయవచ్చు.

లెవెల్ ఇన్‌కమ్ బెనిఫిట్, ఇంక్రీసింగ్ ఇన్‌కమ్ బెనిఫిట్, సింగిల్ ప్రీమియం లెవెల్ ఇన్‌కమ్ బెనిఫిట్, సింగిల్ బెనిఫిట్ పేరుతో నాలుగు రకాల ప్రయోజనాలను అందిస్తుంది. మెచ్యూరిటీ సమయంలో గ్యారెంటీడ్ ఇన్‌కమ్ బెనిఫిట్, గ్యారెంటీడ్ టెర్మినల్ బెనిఫిట్స్ లభిస్తాయి. ఒకవేళ పాలసీహోల్డర్ పాలసీ కొనసాగుతున్న కాలంలో మరణిస్తే వారి కుటుంబానికి ఆర్థిక మద్దతు లభిస్తుంది. డెత్ బెనిఫిట్ కూడా ఒకేసారి పొందొచ్చు. లేదా ఐదేళ్లపాటు ఇన్‌స్టాల్‌మెంట్ పద్ధతిలో పొందొచ్చు.

సమ్ అష్యూర్డ్ విషయానికి వస్తే ఆప్షన్ ఏ, ఆప్షన్ బీ ఎంచుకుంటే కనీసం రూ.3,30,000, ఆప్షన్ సీ ఎంచుకుంటే రూ.2,50,000, ఆప్షన్ డీ ఎంచుకుంటే రూ.22,00,000 సమ్ అష్యూర్డ్ ఉండాలి. గరిష్ట పరిమితి లేదు. ఈ పాలసీ తీసుకోవడానికి కనీస వయస్సు మూడేళ్లు. ఎల్ఐసీ ధన్ సంచయ్ పాలసీని ఆన్‌లైన్‌లో తీసుకోవచ్చు. లేదా ఎల్ఐసీ ఏజెంట్ల ద్వారా తీసుకోవచ్చు.

Tags:    

Similar News