LIC: ఎల్‌ఐసీలో పేదల పాలసీ అంటే ఇదేనేమో..!

LIC: ఎల్‌ఐసీలో పేదల పాలసీ అంటే ఇదేనేమో..!

Update: 2022-08-26 04:30 GMT

LIC: ఎల్‌ఐసీలో పేదల పాలసీ అంటే ఇదేనేమో..!

LIC: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) దేశంలోనే అతిపెద్ద జీవిత బీమా సంస్థ. ఈ రోజుల్లో చాలా బీమా కంపెనీలు మార్కెట్లోకి వచ్చాయి. కానీ నేటికీ దేశంలోని అధిక జనాభా ఎల్‌ఐసీలోనే పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడుతుంది. ఎల్‌ఐసీ ధనిక, మధ్యతరగతి, తక్కువ ఆదాయ వర్గాలు అందరికి పాలసీలని రూపొందించింది. మీరు తక్కువ ఆదాయ సమూహం వారైతే ఒక గొప్ప ఎండోమెంట్ ప్లాన్ ఉంది. ఈ పథకం పేరు ఎల్‌ఐసి భాగ్యలక్ష్మి ప్లాన్. ఈ బీమా పాలసీ తక్కువ ఆదాయ వర్గాల ప్రజల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. ఈ పాలసీలో చిన్న పెట్టుబడి పెట్టడం ద్వారా అధిక రాబడి సంపాదించవచ్చు.

ఎల్‌ఐసీ భాగ్యలక్ష్మి ప్లాన్

ఎల్‌ఐసీ భాగ్యలక్ష్మి ప్లాన్ నాన్ లింక్డ్, ఇండివిజువల్ లైఫ్ మైక్రో ఇన్సూరెన్స్, టర్మ్ ప్లాన్. ఈ ప్లాన్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా మెచ్యూరిటీపై 110% రాబడిని పొందవచ్చు. మీరు ఈ బీమా ప్లాన్‌ని వివిధ కాల వ్యవధిలో కొనుగోలు చేయవచ్చు. ఎల్‌ఐసీ భాగ్య లక్ష్మి ప్లాన్ వివరాల గురించి తెలుసుకుందాం.

ఎల్‌ఐసీ భాగ్యలక్ష్మి ప్లాన్ లక్షణాలు

1.పథకం కనీస హామీ మొత్తం - రూ.50,000

2.పథకం గరిష్ట హామీ మొత్తం -2,00,000

3.ప్లాన్ కొనుగోలు వయస్సు - 8 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల వయస్సు

4.ప్రీమియం చెల్లింపు కనీస వ్యవధి - 5 సంవత్సరాలు

5.ప్రీమియం చెల్లించడానికి గరిష్ట వ్యవధి - 13 సంవత్సరాలు

6.పాలసీ వ్యవధి - ప్రీమియం చెల్లింపు వ్యవధి + 2 సంవత్సరాలు

7.ఈ ప్లాన్ గరిష్ట మెచ్యూరిటీ వయస్సు - 65 సంవత్సరాలు

ఒక వ్యక్తి 20 సంవత్సరాల వయస్సులో 15 సంవత్సరాలకు ఎల్‌ఐసి భాగ్యలక్ష్మి ప్లాన్‌ను ఎంచుకుంటే అతను 13 సంవత్సరాల వరకు ప్రీమియం చెల్లించాలి. మీ హామీ మొత్తం రూ. 2 లక్షలు అయితే ప్రతి రూ.1,000కి ప్రీమియంగా రూ. 37.20 చెల్లించాలి. అంటే వార్షిక ప్రీమియం రూ.7,440 అవుతుంది. మీరు రోజుకు 21 రూపాయలు మాత్రమే ఖర్చు చేయాలి. మీరు 15 సంవత్సరాల తర్వాత మెచ్యూరిటీపై రూ.2 లక్షల పూర్తి రాబడిని పొందుతారు. ఇది పెట్టుబడి పెట్టిన మొత్తంలో దాదాపు 110% ఉంటుంది. మీరు ఎల్‌ఐసీ భాగ్యలక్ష్మి ప్లాన్‌ని ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు.

Tags:    

Similar News