LIC Policy: మహిళలకి ఉత్తమ ఎంపిక.. రోజు రూ. 58 పొదుపు చేస్తే 8 లక్షలు మీవే..!

LIC Policy: మహిళలకి ఉత్తమ ఎంపిక.. రోజు రూ. 58 పొదుపు చేస్తే 8 లక్షలు మీవే..!

Update: 2023-01-16 14:00 GMT

LIC Policy: మహిళలకి ఉత్తమ ఎంపిక.. రోజు రూ. 58 పొదుపు చేస్తే 8 లక్షలు మీవే..!

LIC Policy: ఎల్‌ఐసీ మహిళలకి బంపర్ ఆఫర్ అందిస్తోంది. చిన్న పెట్టుబడి ద్వారా పెద్ద మొత్తం సంపాదించే అవకాశాన్ని కల్పిస్తోంది. ఎల్ఐసీ ఆధార్ శిలా స్కీమ్‌లో ప్రతిరోజూ రూ. 58 రూపాయలు పెట్టుబడి పెట్టడం వల్ల మెచ్యూరిటీలో 8 లక్షల వరకు సంపాదించవచ్చు. ఈ పాలసీ ప్రకారం 8 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల వయస్సు గల మహిళలు ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ స్కీం గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.

నేటికీ దేశంలోని కోట్లాది మంది ప్రజలు ఎల్‌ఐసీలో పెట్టుబడి పెడుతున్నారు. ఎల్‌ఐసీ కూడా తన కస్టమర్లను ఎప్పుడూ నిరాశపరచదు. ఎల్ఐసీ ఆధార్ శిలా ప్లాన్ కింద కస్టమర్ డబ్బును ఆదా చేసుకోగలుగుతారు, మంచి రాబడిని పొందుతారు. ఈ పథకం కింద పాలసీదారు మరణించిన తర్వాత కూడా నామినీకి మొత్తం డబ్బు అందజేస్తారు.

ఎల్ఐసీ ఆధార్ శిలా ప్లాన్ ప్రత్యేకతలు

1. ఎల్ఐసీ ఆధార్ శిలా యోజన మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించారు.

2. కనీస పాలసీ వ్యవధి 10 సంవత్సరాలు, గరిష్టం 20 సంవత్సరాలు.

3. ఈ ప్లాన్ మెచ్యూరిటీ గరిష్ట వయస్సు 70 సంవత్సరాలు.

4. పాలసీ తీసుకున్న 5 సంవత్సరాల తర్వాత పాలసీదారు మరణిస్తే మెచ్యూరిటీపై లాయల్టీ అడిషన్ సౌకర్యం ఉంటుంది.

5. పాలసీ వ్యవధి ముగిసే సమయానికి ఒకేసారి మొత్తం అందుకుంటారు.

6. పథకం కింద కనీసం 75000 రూపాయలు, గరిష్టంగా 3 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టవచ్చు.

7. నెలవారీ, త్రైమాసికం, అర్ధ సంవత్సరం లేదా వార్షిక ప్రాతిపదికన ఈ ప్లాన్‌ను ప్రీమియం చెల్లించే అవకాశం ఉంది.

30 సంవత్సరాల వయస్సులో మీరు ఈ పథకంలో చేరితే వరుసగా 20 సంవత్సరాలు ప్రతిరోజూ రూ. 58 డిపాజిట్ చేశారనుకోండి.. అప్పుడు మీ మొదటి సంవత్సరంలో మొత్తం రూ. 21918 అవుతుంది. దానిపై మీరు 4.5 శాతం పన్ను చెల్లించాలి. ఆ తర్వాత రెండో సంవత్సరంలో రూ.21446 చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు ఈ ప్రీమియాన్ని నెలవారీ, త్రైమాసిక, అర్ధ వార్షిక లేదా వార్షిక ప్రాతిపదికన డిపాజిట్ చేస్తారు. ప్రతి సంవత్సరం ప్రీమియం చెల్లిస్తే 20 సంవత్సరాలకు రూ. 429392 డిపాజిట్ చేస్తారు. తర్వాత మెచ్యూరిటీ సమయంలో మీరు మొత్తం రూ. 794000 పొందుతారు.

Tags:    

Similar News