మహిళలకి మాత్రమే.. ప్రతి నెలా రూ.870 పొదుపుతో 4 లక్షల ఆదాయం..!

మహిళలకి మాత్రమే.. ప్రతి నెలా రూ.870 పొదుపుతో 4 లక్షల ఆదాయం..!

Update: 2022-09-08 14:30 GMT

మహిళలకి మాత్రమే.. ప్రతి నెలా రూ.870 పొదుపుతో 4 లక్షల ఆదాయం..!

Aadhaar Shila Plan: ఎల్‌ఐసీ అనేది భారతదేశంలోనే అతిపెద్ద జీవిత బీమా సంస్థ. ఇందులో చాలా మంది పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడతారు. భద్రత, పొదుపు పరంగా ఎల్‌ఐసి ప్లాన్‌లు అద్భుతంగా ఉంటాయి. ఈ రోజు ఎల్‌ఐసికి సంబంధించి ఒక సూపర్ ప్లాన్ గురించి తెలుసుకుందాం. ఇది మహిళల ఆర్థిక స్థితిని బలోపేతం చేయడానికి ప్రత్యేకంగా రూపొందించారు. ఈ పథకంలో రోజుకు రూ.29 ఆదా చేస్తే రూ.4 లక్షలు సంపాదించవచ్చు. ఈ ప్లాన్ గురించి వివరంగా తెలుసుకుందాం.

ఈ పథకం పేరు ఎల్‌ఐసీ ఆధార్ శిలా ప్లాన్. ఈ పథకం కింద 8 నుంచి 55 సంవత్సరాల వయస్సు గల మహిళలు ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు. ఎల్‌ఐసీ ఆధార్ శిలా ప్లాన్ వినియోగదారులకు భద్రత, పొదుపు రెండింటినీ అందిస్తుంది. అయితే ఆధార్ కార్డు ఉన్న మహిళలు మాత్రమే దీనిని సద్వినియోగం చేసుకోగలరు. మెచ్యూరిటీ తర్వాత డబ్బును పొందుతారు. అంతేకాదు పాలసీదారు మరణానంతరం కూడా కుటుంబానికి ఆర్థిక సహాయం లభిస్తుంది.

ఎల్‌ఐసీ ఆధార్ శిలా ప్లాన్ కనీసం రూ.75000, గరిష్టంగా రూ.3 లక్షలు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పాలసీ మెచ్యూరిటీ వ్యవధి కనిష్టంగా 10 సంవత్సరాలు. గరిష్టంగా 20 సంవత్సరాలు. ఈ ప్లాన్‌లో 8 నుంచి 55 సంవత్సరాల వయస్సు గల మహిళలు పెట్టుబడి పెట్టవచ్చు. గరిష్ట మెచ్యూరిటీ వయస్సు 70 సంవత్సరాలు. అదే సమయంలో ఈ ప్లాన్ ప్రీమియం చెల్లింపు నెలవారీ, త్రైమాసికం, అర్ధ సంవత్సరం లేదా వార్షిక ప్రాతిపదికన జరుగుతుంది.

మీకు 30 ఏళ్లు ఉండి 20 ఏళ్లపాటు రోజూ రూ.29 డిపాజిట్ చేస్తే మొదటి సంవత్సరంలో మీకు మొత్తం రూ.10,959 చెల్లించాలి. అందులో 4.5 శాతం పన్ను ఉంటుంది. వచ్చే ఏడాది రూ.10,723 చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు ఈ ప్రీమియంలను ప్రతి నెల, త్రైమాసికం, అర్ధ సంవత్సరం లేదా వార్షిక ప్రాతిపదికన డిపాజిట్ చేయవచ్చు. 20 సంవత్సరాలలో రూ.2,14,696 డిపాజిట్ చేయాలి. మెచ్యూరిటీ సమయంలో మొత్తం రూ.3,97,000 పొందుతారు.

Tags:    

Similar News