కార్మికులకు శుభవార్త.. ఇందులో చేరితే ఉచితంగా 2లక్షల ఇన్సూరెన్స్..

E-Shram Portal: అసంఘటిత రంగ కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ శ్రమ్‌ పోర్టల్‌కి అనూహ్య స్పందన పెరిగింది.

Update: 2022-01-31 13:30 GMT

కార్మికులకు శుభవార్త.. ఇందులో చేరితే ఉచితంగా 2లక్షల ఇన్సూరెన్స్..

E-Shram Portal: అసంఘటిత రంగ కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ శ్రమ్‌ పోర్టల్‌కి అనూహ్య స్పందన పెరిగింది. కార్మికులు ఈ పోర్టల్‌లో తమ పేర్లను నమోదు చేసుకుంటున్నారు. ఈ శ్రమ్‌ పోర్టల్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. తాజాగా రైల్వే వేర్‌హౌస్‌లలో పనిచేసే వర్కర్లు కూడా ఈ-శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేసుకోవచ్చని కేంద్రం తెలిపింది. ఈ-శ్రమ్ పోర్టల్‌లోని అసంఘటిత వర్కర్ల జాబితాలో వేర్‌హౌస్ లేబర్ కూడా కనిపిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. దీంతో రైల్వే వేర్‌హౌస్‌లో పనిచేసే వర్కర్లు పేర్లను నమోదు చేసుకోవాలని సూచించింది. వారికి కూడా ఈ-శ్రమ్ కార్డు జారీ అవుతుంది.

కార్మిక మంత్రిత్వ శాఖ ప్రకారం.. అసంఘటిత కార్మికులు, గిగ్ ప్లాట్‌ఫారమ్ కార్మికులు, నిర్మాణ కార్మికులను కలిగి ఉన్న మొదటి జాతీయ డేటాబేస్ ఇది. ఈ శ్రమ్‌ నమోదులో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో ఉండగా, పశ్చిమ బెంగాల్, బీహార్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రత ప్రయోజనాలను పంపిణీ చేయడంలో ఇది సహాయపడుతుంది. దేశంలోని ఏ మూలలోనైనా పనిచేస్తున్న అసంఘటిత రంగ కార్మికులైనా ఇ-శ్రమ్‌ పోర్టల్‌లో నమోదు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ కోసం మూడు ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో మొదటిది స్వీయ రిజిస్ట్రేషన్, రెండోది సాధారణ సేవా కేంద్రం, మూడవది రాష్ట్ర సేవా కేంద్రం. మీరు ఆన్‌లైన్‌కి వెళ్లడం ద్వారా పోర్టల్‌లో మిమ్మల్ని మీరు నమోదు చేసుకోవచ్చు.

ఈ పోర్టల్‌లో తమ పేర్లను నమోదు చేసుకున్న వారికి ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన కింద ప్రయోజనాలు అందుతాయి. ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజనను పొందవచ్చు. పీఎం శ్రమ్ యోగి మంధన్ యోజన ప్రయోజనాలను కూడా వర్కర్లకు కేంద్రం కల్పిస్తుంది. మంధన్ స్కీమ్ కింద కేవలం రోజుకు రూ.2 చెల్లించడం ద్వారా ఏడాదికి రూ.36 వేల పెన్షన్‌ను కార్మికులు పొందవచ్చు. 18 ఏళ్లు వచ్చినప్పటి నుంచి 40 ఏళ్ల వయసు దాకా ఈ పథకాన్ని ప్రారంభించుకోవచ్చు. అంతేకాక కార్మికులకు ఏదైనా ప్రమాదం జరిగి అంగవైకల్యం పొందితే రూ.2 లక్షల నుంచి రూ.లక్ష వరకు ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం కల్పించనుంది.

Tags:    

Similar News