Investment Tips: ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై మరింత వడ్డీ కావాలా.. ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి..!

Investment Tips: డబ్బులు పెట్టుబడి పెట్టడానికి మార్కెట్‌లో అనేక మార్గాలు ఉన్నాయి. అయితే అందరికి తెలిసింది మాత్రం బ్యాంకులో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయడం.

Update: 2023-07-23 15:00 GMT

Investment Tips: ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై మరింత వడ్డీ కావాలా.. ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి..!

Investment Tips: డబ్బులు పెట్టుబడి పెట్టడానికి మార్కెట్‌లో అనేక మార్గాలు ఉన్నాయి. అయితే అందరికి తెలిసింది మాత్రం బ్యాంకులో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయడం. ఇది జనాదరణ పొందిన పెట్టుబడి సాధనాలలో ఒకటి. అంతేకాకుండా మీ డబ్బుకి వడ్డీతో పాటు భద్రత కూడా ఉంటుంది. అందుకే సామాన్య ప్రజలు ఎక్కువ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై మొగ్గుచూపుతారు. అయితే ఎఫ్‌డీల నుంచి ఎక్కువ ప్రయోజనం పొందడానికి కొన్ని విషయాలని గమనించాలి. వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం.

ఒకటి లేదా అంతకంటే ఎక్కువ FDలలో పెట్టుబడి

ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టేటప్పుడు మీ దగ్గర ఉన్న డబ్బులతో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ డిపాజిట్లు చేయాలి. స్వల్పకాలిక అవసరాలు, దీర్ఘకాలిక లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టాలి. అప్పుడు అవసరాలకి అనుకూలంగా సహాయపడే రాబడిని పొందుతారు. అంతేకాకుండా అప్పులు చేయకుండా ఉంటారు.

వడ్డీ రేట్లను పోల్చాలి..?

ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టే ముందు వివిధ బ్యాంకులు అందించే FD వడ్డీ రేట్లను సరిపోల్చాలి. ఏ బ్యాంకు ఎక్కువ చెల్లిస్తుందో అందులో డిపాజిట్‌ చేయాలి. ఎందుకంటే మీరు పొందే రాబడి బ్యాంకు అందించే వడ్డీ రేటుపై ఆధారపడి ఉంటుంది. వివిధ బ్యాంకులు కాలవ్యవధిని బట్టి వివిధ వడ్డీ రేట్లను అందిస్తాయి. మెచ్యూరిటీ మొత్తాన్ని స్వీకరించిన తర్వాత దానిని తక్షణ ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి ఉపయోగించవచ్చు లేదా నచ్చిన పెట్టుబడి సాధనాల్లో మళ్లీ పెట్టుబడి పెట్టవచ్చు. లేదంటే మళ్లీ FDలో తిరిగి పెట్టుబడి పెట్టవచ్చు.

FD మంచిదా లేదా స్టాక్ మంచిదా?

FD సురక్షితమైన పెట్టుబడిగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇది హామీతో కూడిన రాబడిని అందిస్తుంది. అయితే స్టాక్‌లు అధిక రాబడిని అందిస్తాయి కానీ ప్రమాదకరమైన పెట్టుబడులుగా చెప్పాలి. రెండూ గొప్ప పెట్టుబడి సాధనాలు అందుకే కొంత భాగాన్ని FDలలో, మరికొంత భాగాన్ని స్టాక్‌లలో పెట్టుబడి పెట్టాలి. అలాగే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వచ్చే వడ్డీని ఇతర వనరుల నుంచి వచ్చే ఆదాయంగా పరిగణిస్తారు. కాబట్టి పన్ను విధిస్తారని గుర్తుంచుకోండి.

Tags:    

Similar News