Savings Schemes: సుకన్య సమృద్ధి కంటే ఎక్కువ వడ్డీ ఈ స్కీమ్‌లో పొందవచ్చు.. వివరాలు తెలుసకోండి..!

Savings Schemes: ప్రభుత్వ పథకాలలో గ్యారంటీ ఆదాయం ఉంటుంది.

Update: 2023-11-16 15:00 GMT

Savings Schemes: సుకన్య సమృద్ధి కంటే ఎక్కువ వడ్డీ ఈ స్కీమ్‌లో పొందవచ్చు.. వివరాలు తెలుసకోండి..!

Savings Schemes: ప్రభుత్వ పథకాలలో గ్యారంటీ ఆదాయం ఉంటుంది. మీరు పెట్టే పెట్టుబడి భద్రంగా ఉంటుంది. ప్రభుత్వ పొదుపు పథకాల్లో ఒకటైన సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ను ప్రజలు ఎంతో ఇష్టపడుతున్నారు. సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ (SCSS) అక్టోబర్‌, డిసెంబర్ త్రైమాసికం మధ్య పెట్టుబడులపై 8.2% వడ్డీని అందిస్తోంది. ఈ ఖాతాలో ఎవరైనా రూ.30 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. అయితే ఒక్కరు ఎన్ని ఖాతాలు ఓపెన్‌ చేయవచ్చు తదితర విషయాల గురించి ఈ రోజు తెలుసుకుందాం.

SCSSలో ఎవరు పెట్టుబడి పెట్టగలరు?

60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ఎవరైనా SCSS పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. 55 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న రిటైర్డ్ వ్యక్తులు కానీ 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు కూడా ఈ పథకాన్ని ఎంచుకోవచ్చు. మీరు రిటైర్మెంట్‌చేసిన నెలలోపు పెట్టుబడి పెట్టినట్లయితే ఐదేళ్లు కొనసాగించవచ్చు. అనంతరం దాని మెచ్యూరిటీ వ్యవధిని మూడేళ్లపాటు పొడిగించవచ్చు.

ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు తెరవవచ్చా?

ఒక పెట్టుబడిదారుడు కొన్ని నిబంధనలకు లోబడి ఒకటి కంటే ఎక్కువ SCSS ఖాతాలను తెరవవచ్చని SBI తెలిపింది. బ్యాంకు, పోస్టాఫీసుల్లో SCSS ఖాతా తెరవవచ్చని నిపుణులు చెబుతున్నారు. మీరు ఎక్కువ ఖాతాలను తెరిస్తే మీరు డిపాజిట్ చేసిన మొత్తం రూ. 30 లక్షలకు మించకూడదు. భార్యాభర్తలు ఉమ్మడి ఖాతాను తెరవవచ్చు. ఏ పెట్టుబడిదారుడైనా ఒకటి కంటే ఎక్కువ SCSS ఖాతాలను తెరవవచ్చు కానీ దాని మొత్తం రూ. 30 లక్షల పరిమితిని మించకూడదు.

Tags:    

Similar News