Stock Market: ట్రంప్ ప్రకటనతో మళ్లీ ఊపందుకున్న స్టాక్ మార్కెట్

Stock Market: ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరిందని, ఇక రెండు దేశాల మధ్య యుద్ధం ముగిసినట్లేనని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ చెప్పారు.

Update: 2025-06-24 06:46 GMT

Stock Market: ట్రంప్ ప్రకటనతో మళ్లీ ఊపందుకున్న స్టాక్ మార్కెట్

Stock Market: ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరిందని, ఇక రెండు దేశాల మధ్య యుద్ధం ముగిసినట్లేనని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ చెప్పారు. అయితే ట్రంప్ చేసిన ఈ ప్రకటనతో స్టాక్ మార్కట్ మళ్లీ ఊపురి తీసుకుంది. ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య యుద్దకారణంగా ఒడిదుడుకులు ఎదుర్కోంటున్న స్టాక్ మార్కెట్ ఇప్పుడు మళ్లీ పుంజుకోవడంతో ఇన్వెస్టర్లు ఆనందంగా ఉన్నారు.

గత కొన్నాళ్లుగా ఇరాన్, ఇజ్రాయిల్ దేశాల మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. అయితే దీని ప్రభావం ఆయిల్, పెట్రోల్, బంగారంపైనే కాదు స్టాక్ మార్కెట్‌పైనా తీవ్రంగా పడింది. గత కొన్నిరోజులుగా స్టాక్ మార్కెట్‌ తీవ్రమైన ఒడిదుడుకులను ఎదుర్కోంటుంది. లాభాలు అనేవి కనిపించకపోవడంతో ఇన్వెస్టర్లు నిరాశతో ఉన్నారు. అయితే తాజాగా ఇరాన్, ఇజ్రాయిల్ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని, ఇక యుద్ధం ముగిసిందనే ప్రకటనను ట్రంప్‌ ఇవ్వడంతో ఇన్వెస్టర్లు రిలాక్స్ అయ్యారు.

మంగళవానం ఉదయం స్టాక్ మార్కెట్ మొదలైనప్పటి నుంచి సూచీలు భారీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ ర్యాలీలు ముందుకు పరుగులు పెట్టాయి. ప్రారంభంలో సెన్సెక్స్ 930 పాయింట్లు లాభంతో దూసుకెళితే.. ప్రస్తుతం అది 900 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. ఇక నిఫ్టీ 278 పాయింట్లతో దూసుకెళ్లగా ప్రస్తుతం 264 పాయింట్ల లాభంతో 25, 236 దగ్గర కొనసాగుతోంది. దీంతో పాటు అంతర్జాతీయ ఆయిల్ రేట్లు కూడా దిగనున్నాయి.

Tags:    

Similar News