Business Idea: 20 వేలు పెట్టుబడి పెట్టి ఏడాదికి 4 లక్షలు సంపాదించండి..!

Business Idea: వ్యాపారం చేయాలనే ఆలోచన ప్రతి ఒక్కరి మదిలో ఉంటుంది...

Update: 2022-04-19 08:45 GMT

Business Idea: 20 వేలు పెట్టుబడి పెట్టి ఏడాదికి 4 లక్షలు సంపాదించండి..!

Business Idea: వ్యాపారం చేయాలనే ఆలోచన ప్రతి ఒక్కరి మదిలో ఉంటుంది. కానీ పెట్టుబడి(Investment) లేకపోవడం వల్ల చాలామంది వెనుకడుగు వేస్తారు. అయితే ఈ బిజినెస్‌(Business) కి మీకు ఎక్కువ డబ్బు అవసరం లేదు. దీని కోసం మీకు వ్యవసాయ భూమి ఉంటే చాలు. గ్రామాల్లో ఉండేవారికి సాగుభూమి ఎంతో కొంత ఉంటుంది. ఒకవేళ లేకపోయినా మీరు ఈ పని కోసం భూమిని లీజుకు తీసుకోవచ్చు. ఈ లాభదాయకమైన వ్యాపారం గురించి ప్రధాని మోదీ(PM Narendra Modi) కూడా తన ప్రసంగంలో ప్రస్తావించారు.

ఈ వ్యాపారం నిమ్మగడ్డి సాగుకు సంబంధించినది. దీనిని 'లెమన్ గ్రాస్' అని కూడా అంటారు. ఒక హెక్టారు భూమిలో నిమ్మగడ్డి సాగు చేయడం ద్వారా ఏడాదికి రూ.4 లక్షలు సులభంగా సంపాదించవచ్చు. ఉత్పత్తిని పెంచడం ద్వారా మీ ఆదాయాన్ని మరింత పెంచుకోవచ్చు. నిమ్మగడ్డి మొక్క ఒక్క రూపాయికే దొరుకుతుంది. జంతువులు తినవు, పురుగు పట్టకపోవడం దీని ప్రత్యేకత. మార్కెట్‌లో నిమ్మగడ్డి నూనెకు చాలా డిమాండ్‌(Demand) ఉంది.

లెమన్ గ్రాస్(Lemongrass) నుంచి తీసిన నూనెను సౌందర్య సాధనాలు(Beauty Products), సబ్బులు(Soaps), నూనెలు(Oil), ఔషధాలను(Medicine) తయారు చేసే కంపెనీలు ఉపయోగిస్తాయి. దీని మొక్కను కరువు ప్రభావిత ప్రాంతాల్లో కూడా నాటవచ్చు. ఈ పంటకి ఎరువులు(Fertilizers) అవసరం లేదు. ఒకసారి నాటిన పంట 5-6 సంవత్సరాల వరకు ఉంటుంది.

నిమ్మ గడ్డిని నాటడానికి సమయం ఫిబ్రవరి నుంచి జూలై అనువైనది. ఏడాదికి మూడు నాలుగు సార్లు పండిస్తారు. ఇందులో నుంచి వచ్చే నూనె ధర కిలోకు వెయ్యి నుంచి 1,500 రూపాయల వరకు ఉంటుంది. నాటిన నాలుగు నెలల తర్వాత మొదటి కోతకు వస్తుంది. లెమన్ గ్రాస్ పెంపకాన్ని 'మన్ కీ బాత్' 67వ ఎడిషన్‌లో ప్రధాని మోదీ ప్రస్తావించారు. మీకు ఆసక్తి ఉంటే వెంటనే ప్రారంభించండి.

Tags:    

Similar News