Invest Daughters Name: కూతురి పేరుపై ఉత్తమ పెట్టుబడి.. రూ.64 లక్షల ఆదాయం..!

Invest Daughters Name: ఈ రోజుల్లో పిల్లల చదువు, ఉద్యోగం, పెళ్లిళ్లకి చాలా ఖర్చవుతుంది. వారికోసం ఉన్న ఆస్తులని అమ్ముకొని కార్యక్రమాలని నిర్వహిస్తున్నారు.

Update: 2023-07-18 12:30 GMT

Invest Daughters Name: కూతురి పేరుపై ఉత్తమ పెట్టుబడి.. రూ.64 లక్షల ఆదాయం..!

Invest Daughters Name: ఈ రోజుల్లో పిల్లల చదువు, ఉద్యోగం, పెళ్లిళ్లకి చాలా ఖర్చవుతుంది. వారికోసం ఉన్న ఆస్తులని అమ్ముకొని కార్యక్రమాలని నిర్వహిస్తున్నారు. దీని నుంచి తప్పించుకోవాలంటే పిల్లలు పుట్టిన వెంటనే వారి పేరుపై పెట్టుబడి పెట్టాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు కూతురి పేరుపై పెట్టుబడి పెట్టి భవిష్యత్‌పై భరోసా కల్పించాలి. ఆడపిల్లల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చాలా స్కీములని ప్రారంభించాయి. అందులో అత్యంత ముఖ్యమైనది సుకన్య సమృద్ధి యోజన. ఇందులో పెట్టుబడి పెట్టినట్లయితే ఆడపిల్లల చదువు, పెళ్లికోసం ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

సుకన్య సమృద్ధి యోజన ఒక చిన్న పొదుపు పథకం. కేంద్ర ప్రభుత్వం ప్రతి మూడు నెలలకోసారి వడ్డీ రేటును నిర్ణయిస్తుంది. జూలై నుంచి సెప్టెంబర్ 2023 వరకు ఉన్న త్రైమాసికానికి ఈ పథకం వడ్డీ రేటులో ఎటువంటి మార్పు చేయలేదు. ప్రస్తుతం ఏడాదికి 8 శాతం చొప్పున వడ్డీ లభిస్తుంది. సుకన్య సమృద్ధి ఖాతాను కుమార్తె పుట్టిన తర్వాత తెరవాలి. కుమార్తెకు 10 ఏళ్లు వచ్చే వరకు ఖాతా తెరవవచ్చు. కుమార్తె పుట్టిన వెంటనే ఖాతా తెరిచినట్లయితే పెట్టుబడిదారుడు 15 సంవత్సరాల పాటు డబ్బులు జమ చేయవచ్చు. కుమార్తె మెచ్యూరిటీ మొత్తంలో 50% విత్‌డ్రా చేసుకోవచ్చు. కుమార్తెకు 21 ఏళ్లు వచ్చినప్పుడు మిగిలిన మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు.

సుకన్య సమృద్ధి ఖాతాలో ప్రతి నెలా రూ.12,500 జమచేస్తే 64 లక్షలు సంపాదించవచ్చు. అంటే ఏడాదికి రూ.1.5 లక్షలు జమ చేయాలి. మెచ్యూరిటీపై వడ్డీ రేటు 7.6 శాతంగా పరిగణిస్తే కుమార్తె కోసం భారీ మొత్తం సిద్ధంగా ఉంటుంది. కుమార్తెకు 21 ఏళ్లు నిండిన తర్వాత మొత్తం డబ్బును విత్‌డ్రా చేస్తే మెచ్యూరిటీ మొత్తం రూ.63, 79, 634 వస్తాయి. ఇందులో పెట్టుబడి పెట్టిన మొత్తం రూ. 22,50,000 అవుతుంది. ఈ విధంగా సుకన్య సమృద్ధి ఖాతాలో ప్రతి నెలా రూ.12,500 జమ చేయడం వల్ల 21 ఏళ్లు వచ్చేసరికి దాదాపు రూ.64 లక్షలు వస్తాయి. అంతేకాదు ఈ పథకంలో సంవత్సరానికి రూ.1.50 లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు లభిస్తుంది. ఏడాదిలో గరిష్టంగా రూ.1.5 లక్షలు డిపాజిట్ చేయవచ్చు.

Tags:    

Similar News