IndiGo Monsoon Sale: ఇండిగో సూపర్ ఆఫర్.. కేవలం ₹1,499కే ఫ్లైట్ టికెట్!

IndiGo Monsoon Sale: విమానాల్లో ప్రయాణించేవారికి ఇండిగో గుడ్ న్యూస్‌ని తీసుకొచ్చింది. దాదాపు 50 శాతం వరకు టికెట్ ధరలు తగ్గిస్తూ మాన్సూన్ ఆఫర్‌‌ని ప్రకటించింది.

Update: 2025-06-25 07:00 GMT

IndiGo Monsoon Sale: ఇండిగో సూపర్ ఆఫర్.. కేవలం ₹1,499కే ఫ్లైట్ టికెట్!

IndiGo Monsoon Sale: విమానాల్లో ప్రయాణించేవారికి ఇండిగో గుడ్ న్యూస్‌ని తీసుకొచ్చింది. దాదాపు 50 శాతం వరకు టికెట్ ధరలు తగ్గిస్తూ మాన్సూన్ ఆఫర్‌‌ని ప్రకటించింది. ఎంపిక చేసుకున్న దేశీయ, అంతర్జాతీయ విమానాల ప్రయాణీకులకు ఈ ఆఫర్లు వర్తిస్తాయి. ఇంకా క్లియర్‌‌గా ఈ ఆఫర్ల గురించి తెలుసుకుందాం.

ఆసియాలో అతిపెద్ద విమానయాన సంస్థల్లో ఒకటి ఇండిగో. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రయాణికులు ఎక్కువగా నమ్మి, ప్రయాణించే సంస్థ కూడా ఇదే. అయితే ఇటీవల అహ్మదాబాద్‌లో జరిగిన ఇండిగో విమాన ప్రమాదం కారణం పలు ఒడిదుడుకులు ఈ సంస్థ ఎదుర్కొంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇండిగో విమానాలన్నింటినీ సాంకేతికంగా పరిశీలించాలని ఒక స్పెషల్ బృందాన్ని పంపింది. అంతేకాదు ఇప్పుడు ఇండిగో ప్రయాణికుల కోసం మంచి మాన్ సూన్ ఆఫర్లను తీసుకొచ్చింది.

దేశీయ విమాన టికెట్ల ధర రూ. 1,499. అంతర్జాతీయ విమాన టెక్కెట్ల ధర రూ.4,399. అంతేకాదు, ఈ పరిమిత కాల అమ్మకం ఇండిగో దేశీయ, అంతర్జాతీయ విమానాలలో ప్రయాణించే ప్రయాణికులు ఎంచుకున్న వివిధ రకాల యాడ్..ఆన్‌లపై ప్త్రత్యేక తగ్గింపులను ఇండిగో ప్రకటించింది. ఈ ఆఫర్స్ వచ్చే నెల జూలై 1 నుంచి సెప్టెంబర్ 21 మధ్య ప్రయాణానికి జూన్ 24–జూన్ 29 మధ్య చేసిన బుకింగ్‌లకు ఈ ఆఫర్ చెల్లుబాటు అవుతుంది.

అదే విధంగా ప్రయాణికుల అదనపు సౌకర్యం, అదనపు లెగ్ రూమ్‌ల కోసం కూడా స్పెషల్ ఆఫర్లను ఇండిగో తీసుకొచ్చింది. అలాగే దేశీయ విమానాలకు ప్రీ పెయిడ్ అదనపు సామానుపై ప్రయాణికులు ఇప్పుడు 50 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. అంతర్జాతీయ విమానాల విషయానికొస్తే లగేజీల్లో 15 కిలోలు, 20 కిలోలు, 30 కిలోల బ్యాగ్ అలవెన్సులపై కూడా తగ్గింపు పొందవచ్చు. అదేవిధంగా చెక్ ఇన్, ఎప్పుడైనా బోర్డింగ్‌తో పాటు ఫాస్ట్ ఫార్వర్డ్ సేవపై ఇండిగో 50 శాతం వరకు తగ్గింపును కూడా అందిస్తోంది. అంతేకాదు, ఇక నుంచి దేశీయ ప్రయాణికులు రూ.299 నుండి ప్రారంభమయ్యే జీరో క్యాన్సిలేషన్ ప్లాన్‌తో తమ బుకింగ్‌లను పొందవచ్చు.

Tags:    

Similar News