Stock Markets: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల బాట
Stock Markets: క్రితం సెషన్ లో స్వల్ప లాభాలతో సరిపుచ్చుకున్న సూచీలు * గ్లోబల్ మార్కెట్ల మిశ్రమ సంకేతాల నేపధ్యం..
Representational Image
Stock Markets: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల బాట పట్టాయి. క్రితం సెషన్ లో స్వల్ప లాభాలతో సరిపుచ్చుకున్న దేశీ సూచీలు..ఏషియన్ మార్కెట్ల మిశ్రమ సంకేతాల నేపధ్యంలో తాజా సెషన్ లో లాభాల బాటన దూకుడుగా సాగుతున్నాయి. అమెరికా బాండ్ల రాబడులు పెరగడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్ల పటిష్ట సంకేతాల నడుమ బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్ 500 పాయింట్ల మేర జంప్ చేయగా నిఫ్టీ 15,100 పాయింట్ల కీలక మైలు రాయిని అధిగమించింది. ప్రస్తుతం సెన్సెక్స్ 0.92 శాతం , నిఫ్టీ 0.93 శాతం మేర లాభాల్లో కొనసాగుతున్నాయి.