Indian Railways: ఇక నుంచి 8 గంటలకు ముందే చార్ట్‌ సిద్దం.. రైల్వే బోర్డు కీలక నిర్ణయం

Indian Railways: ప్రయాణికులకు టికెట్ బుకింగ్‌ విషయంలో రైల్వే బోర్డు కాస్త ఊరటైన నిర్ణయం తీసుకుంది.

Update: 2025-06-30 05:37 GMT

Indian Railways: ఇక నుంచి 8 గంటలకు ముందే చార్ట్‌ సిద్దం.. రైల్వే బోర్డు కీలక నిర్ణయం

Indian Railways: ప్రయాణికులకు టికెట్ బుకింగ్‌ విషయంలో రైల్వే బోర్డు కాస్త ఊరటైన నిర్ణయం తీసుకుంది. చార్ట్ ప్రిపేర్ చేసే విషయంలో ఇప్పుడు రైలు ప్రయాణించే సమయం కంటే 8 గంటల ముందే చార్ట్ సిద్దం అవుతుందని వెల్లడించింది. ఇక దీంతో వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికుల్లో కాస్త టెన్షన్ తగ్గుతుంది.

సాధారణంగా టికెట్లను బుక్ చేసిన తర్వాత బెర్త్‌లు లేకపోతే వెయింటింగ్ లిస్ట్ వస్తుంది. అలాంటి సమయంలో ఈ టికెట్లు కన్ఫామ్ అవ్వాలంటే ప్రయాణించే రోజు ముందు వరకు ఎదురుచూడాల్సి వచ్చేది. అంటే ఉదాహరణకు మీరు నర్సాపూర్ ఎక్స్ ప్రెస్‌కు లింగంపల్లి నుండి వెళ్లాల్సి ఉంటే.. లింగంపల్లిలో ఈ రైలు రాత్రి 9 గంటలకు స్టార్ట్ అవుతుంది అనుకుంటే. 9 గంటల కంటే ముందు 3 లేదా 4 గంటల సమయంలో మాత్రమే చార్ట్ ప్రిపేర్ అయ్యేది. అప్పుడు టికెట్ కన్ఫామ్ అయిందా లేదా అనేది తెలిసేది. అప్పటివరకు రైలు ఎక్కాలా? వద్దా? అన్న సందేహంలో ప్రయాణికులు ఉండిపోయేవారు.

అంతేకాదు వెయిటింట్ లిస్ట్ టికెట్లు కన్ఫామ్ అవుతున్నాయో లేదో తొందరగా తెలియకపోవడం ఒక ఎత్తు అయితే వారు వేరే ప్రత్యామ్నాయం చూసుకోవాలో లేదో తెలియక కూడా ఇబ్బందులు పడేవారు. దీంతో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని రైల్వే బోర్డు దాదాపు 8 గంటల ముందు చార్ట్ ప్రిపేర్ అవ్వాలనే కీలక నిర్ణయాన్ని తీసుకుంది. దీంతో ఇప్పుడు మధ్యాహ్నం 2 గంటల కంటే ముందు బయలుదేరే రైళ్లకు చార్ట్‌ను ముందు రోజు రాత్రి 9 గంటలకే ప్రిపేర్ అవుతుంది. ఇది అమల్లోకి వస్తే వెయిట్ లిస్ట్ టికెట్లు ఉన్న ప్రయాణీకుల్లో టెన్షన్ తగ్గుతుంది.

దీంతో పాటు రైల్వే బోర్డు డిసెంబర్ నాటికి అధునాతన ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్‌(PRS)ను తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తుంది. ఈ ప్రాజెక్ట్‌ను సెంటర్ ఆఫ్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్‌ ద్వారా అమలు చేయనుంది. ఒకవేళ ఈ సిస్టమ్ అమలులోకి వస్తే ఒకేసారి ఒక నిమిషంలో 1.5 లక్షల టికెట్ బుకింగ్‌లు జరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఇది నిమిషానికి 32వేల టికెట్లు బుకింగ్ జరుగుతుంది. అయితే ఈ కొత్త సిస్టమ్‌ను తేవడం వల్ల ప్రయాణికులకు రైలు ప్రయాణం అనేది ఈజీ ప్రయాణం అవుతుందని అధికారులు అంటున్నారు.

Tags:    

Similar News