Indian Railways hikes fares: త్వరలో రైల్వే ఛార్జీలు పెంచే ఛాన్స్..జూలై 1 నుంచి కొత్త ఛార్జీలు!!

Indian Railways hikes fares of passenger trains: తక్కువ ఖర్చుతో దూరం ప్రయాణించ గలిగే ఏకైక రంగం రైల్వే. ఈ రైల్వే నెట్ వర్క్ పై నిరంతరం పేద, మధ్యతరగతి ప్రజలు ఆధారపడి జీవిస్తుంటారు. అయితే ఇప్పటివరకు తక్కువ ఖర్చులో ప్రయాణ ఛార్జీలు ఇక నుంచి మరింత పెరగనున్నట్టు తెలుస్తోంది.

Update: 2025-06-24 11:51 GMT

నిజం చెప్పాలంటే రైల్వే ఛార్జీలను పెంచి చాలా సంవత్సరాలు అయింది. అయితే ఇప్పుడు పెంచుతున్న ఛార్జీలు జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్టు సమాచారం. ఛార్జీల పెంపు విషయానికొస్తే నాన్–ఏసీ మెయిల్ లేదా ఎక్స్ ప్రెస్ రైళ్ల ప్రయాణీకుల ఛార్జీలు కిలోమీటర్‌‌కు ఒక పైసా చొప్పున పెరగనుంది. అదేవిధంగా, ఏసీ క్లాస్ ఛార్జీలు కిలోమీటర్ కు 2 పైసలు చొప్పిన పెరగనున్నట్లు సమాచారం.

అదేవిధంగా 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరాలకు చార్జీల పెంపు కిలోమీటరుకు సంగం పైసా ఉంటే 500 కిమీ ప్రయాణానికి సబర్చన్ టిక్కెట్లు, రెండవ తరగతి ప్రయాణానికి ఛార్జీ పెంపు అనేది ఉండదని తెలుస్తోంది. అలాగే నెలవారీ సీజనల్ టికెట్ల విషయంలోనూ ఛార్జీల పెంపు ఉండదని సమాచారం. అయితే రైల్వే ప్రభుత్వం వీటిపై ఇంకా ఛార్జీల పెంపు ప్రకటనను విడుదల చేయాల్సి ఉంది. అయితే రైల్వే ఛార్జీలు పెంచి చాలా ఏళ్లయిన కారణంగా, రైల్వే రంగాన్ని మరింత అభివృద్ధి చేసే కారణంగా ఈ ఛార్జీలు రైల్వే రంగం పెంచనున్నట్టు సమాచారం. 

Tags:    

Similar News