Stock Market: భారత ఈక్విటీ మార్కెట్లు లాభాల బాటన దూకుడు
Stock Market: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజం సరైన మార్గంలోనే ఉందన్న నిపుణుల అంచనాలు
Reprasentational Image
Stock Market: భారత ఈక్విటీ మార్కెట్లు లాభాల బాటన దూకుడుగా సాగుతున్నాయి. ఉదయం పది గంటల సమయానికి సెన్సెక్స్ 717 పాయింట్లు ఎగసి 48,589 వద్దకు చేరగా నిఫ్టీ 195 పాయింట్లు లాభంతో 14,536 వద్ద కదలాడుతున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజం సరైన మార్గంలోనే ఉందన్న నిపుణుల అంచనాలు ఒకవైపు మరోవైపు దేశంలో కరోనా కల్లోలాన్ని తగ్గించేందుకు కేంద్రం వేగంగా చర్యలు చేపడుతుండడం ఇన్వెస్టర్లలో విశ్వాసం నింపుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో మార్కెట్లు తాజా సెషన్ లో సానుకూలంగా ప్రారంభమయ్యాయి.