Pension Scheme: ఈ ప్రభుత్వ స్కీంలో చేరితే ప్రతి నెల రూ.21000..!

Pension Scheme: ఈ ప్రభుత్వ స్కీంలో చేరితే ప్రతి నెల రూ.21000..!

Update: 2022-09-18 09:30 GMT

Pension Scheme: ఈ ప్రభుత్వ స్కీంలో చేరితే ప్రతి నెల రూ.21000..!

Pension Scheme: మీరు ప్రతి నెల సంపాదించడానికి ఇది మంచి ఐడియా అని చెప్పవచ్చు. ఇందులో పెట్టుబడి పెడితే నెలకి రూ.21,000 పొందుతారు. ఉద్యోగం చేయకుండా, వ్యాపారం చేయకుండా ప్రతి నెలా 21000 రూపాయలు వస్తాయి. ఈ ప్రభుత్వ పథకం పేరు నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS).ఇది ప్రభుత్వ పెన్షన్ పథకం. ఇందులో ఈక్విటీ, డెట్ సాధనాలు రెండు ఉంటాయి. NPS ప్రభుత్వం నుంచి హామీని పొందిన పథకం. రిటైర్మెంట్‌ తర్వాత అధిక పెన్షన్ పొందడానికి ఇందులో పెట్టుబడి పెట్టడం ఉత్తమం.

20 సంవత్సరాల నుంచి పెట్టుబడి

మీరు 20 సంవత్సరాల వయస్సు నుంచి NPSలో డబ్బును డిపాజిట్ చేయడం ప్రారంభించాలి. ప్రతి నెలా 1000 రూపాయలు డిపాజిట్ చేస్తే రిటైర్మెంట్‌ వరకు 5.4 లక్షలు అవుతుంది. ఇది కాకుండా దీనికి 10 శాతం వార్షిక రాబడిని పొందుతారు. దీని కారణంగా మీ పెట్టుబడి 1.05 కోట్లకు పెరుగుతుంది.ఇందులో 40 శాతాన్ని యాన్యుటీగా మార్చినట్లయితే దాని విలువ 42.28 లక్షలు అవుతుంది. అదే సమయంలో నెలవారీ పెన్షన్ 10 శాతం వార్షిక రేటుతో రూ.21,140 అయ్యే అవకాశం ఉంటుంది. ఇది మాత్రమే కాదు చందాదారుడు దాదాపు రూ.63.41 లక్షల మొత్తాన్ని రిటైర్మెంట్‌ సమయంలో పొందుతాడు.

ఆదాయపు పన్ను రాయితీ

NPS పెన్షన్ పథకం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF), సుకన్య సమృద్ధి యోజన మొదలైన ప్రభుత్వ పథకంలాంటిది. ఇందులో పెట్టుబడిదారుడు మెచ్యూరిటీ మొత్తాన్ని సరిగ్గా ఉపయోగించడం ద్వారా నెలవారీ పెన్షన్ మొత్తాన్ని పెంచుకోవచ్చు. NPS ద్వారా సంవత్సరానికి రూ.2 లక్షల వరకు పన్ను ఆదా చేయవచ్చు. ఆదాయపు పన్ను సెక్షన్ 80C కింద గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు పన్ను ఆదా చేయవచ్చు. అంతేకాకుండా ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్ చేస్తే రూ.50,000 వరకు అదనపు పన్ను మినహాయింపు లభిస్తుంది.

Tags:    

Similar News