Die Without Writing Will: వీలునామా రాయకుండా చనిపోతే ఆస్తి పంపకాలు ఏ విధంగా చేస్తారు.. చట్టం ఏం చెబుతుందో తెలుసుకోండి..!
Die Without Writing Will: ఇంటి పెద్ద వీలునామా రాయకుండా చనిపోతే ఆస్తి పంపకాల మధ్య వారసుల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయ.
Die Without Writing Will: వీలునామా రాయకుండా చనిపోతే ఆస్తి పంపకాలు ఏ విధంగా చేస్తారు.. చట్టం ఏం చెబుతుందో తెలుసుకోండి..!
Die Without Writing Will: ఇంటి పెద్ద వీలునామా రాయకుండా చనిపోతే ఆస్తి పంపకాల మధ్య వారసుల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయ. ఇవి చాలామంది ఇళ్లలో మీరు గమనించే ఉంటారు. కోర్టులో ఇలాంటి కేసులు ఇంకా నడుస్తూనే ఉన్నాయి. ఆస్తి పంపిణీకి అత్యంత ముఖ్యమైన పత్రం వీలునామా. వీలునామా రాస్తే ఆస్తి వివాదాలు చాలావరకు ముగుస్తాయి. వీలునామాలో రాసి ఉన్న దాని ప్రకారం ఆస్తి పంపిణీ జరుగుతుంది. ఇప్పుడు వీలునామా రాయకుంటే ఆస్తులు ఎలా పంచుతారో ఈ రోజు తెలుసుకుందాం.
ఆస్తి పంపకాలు వీలునామా ద్వారా నిర్ణయిస్తారు. ఒక వ్యక్తి వీలునామా రాయకుండా మరణిస్తే వారసత్వ చట్టం ప్రకారం ఆస్తులు పంచుతారు. అయితే ఈ మొత్తం ప్రక్రియ అంత సులభంగా ఉండదు. వీలునామా చట్టపరంగా పూర్తిగా చెల్లుతుంది. వీలునామా అనేది ఒక వ్యక్తి మరణించిన తర్వాత అతని ఆస్తిని ఎలా పంచాలో తెలియజేసే ఒక పత్రం.
ఒక వ్యక్తి వీలునామా రాయకుండా మరణిస్తే అప్పుడు న్యాయ పోరాటం ప్రారంభమవుతుంది. కొన్ని మతాలవారికి ఆస్తి పంపిణీ విషయంలో సొంత నియమాలు ఉంటాయి. ఉదాహరణకు ముస్లిం సమాజంలో షరియత్ చట్టం ప్రకారం ఆస్తి పంపిణీ చేస్తారు. మిగిలిన సందర్భాలలో వారసత్వ చట్టం ప్రకారం నిర్ణయాలు తీసుకుంటారు. సాధారణంగా ఈ మొత్తం ప్రక్రియకు చాలా సమయం తీసుకుంటారు.
18 ఏళ్లు పైబడి మానసికంగా ఆరోగ్యంగా ఉన్న ఎవరైనా వీలునామా రాయవచ్చు. అతనికి సంబంధించిన అన్ని ఆస్తుల గురించి ఇందులో పేర్కొనవచ్చు. వీలునామా చాలా సార్లు మార్చుకోవచ్చు ఎవరి పేరు మీద అయినా బదిలీ చేసుకోవచ్చు. అంటే ఒక వ్యక్తి మొత్తం ఆస్తిని మరొకరికి బదిలీ చేయవచ్చు.