ఈ ప్రైవేట్ బ్యాంక్ వడ్డీ రేట్లు పెంచింది.. కొత్త రేట్లు ఎలా ఉన్నాయంటే..?
IDFC First Bank: చాలామంది పెట్టుబడిదారులు మంచి వడ్డీకోసం ఫిక్స్‌డ్ డిపాజిట్లని ఆశ్రయిస్తారు.
ఈ ప్రైవేట్ బ్యాంక్ వడ్డీ రేట్లు పెంచింది.. కొత్త రేట్లు ఎలా ఉన్నాయంటే..?
IDFC First Bank: చాలామంది పెట్టుబడిదారులు మంచి వడ్డీకోసం ఫిక్స్‌డ్ డిపాజిట్లని ఆశ్రయిస్తారు. కానీ ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీరేట్లు వివిధ బ్యాంకులలో వివిధ రకాలుగా ఉంటాయి. వాస్తవానికి రిస్క్ లేని పెట్టుబడి పథకం ఫిక్సడ్ డిపాజిట్ (FD)అని చెప్పవచ్చు. తాజాగా దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన IDFC ఫస్ట్ బ్యాంక్ తన కస్టమర్లకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై మెరుగైన రాబడిని అందిస్తోంది. 2 కోట్ల లోపు ఎఫ్‌డీలపై వడ్డీ రేటును పెంచుతూ బ్యాంక్ నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త రేట్లు 18 జూలై 2022 నుంచి అమలులోకి వచ్చాయి.
2 నుంచి 3 సంవత్సరాల FDలపై వడ్డీ రేటును పెంచాలని బ్యాంక్ నిర్ణయించింది. బ్యాంక్ తన కస్టమర్లకు 7 రోజుల నుంచి 10 సంవత్సరాల FDలపై 3.50 శాతం నుంచి 6.00 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. అదే సమయంలోబ్యాంక్ సీనియర్ సిటిజన్‌కు 4 శాతం నుంచి 6.50 శాతం వరకు వడ్డీ రేటును అందిస్తోంది. సీనియర్ సిటిజన్లకు బ్యాంక్ 0.50 శాతం వడ్డీ రేటును అధికంగా అందిస్తోంది. మీరు ఈ బ్యాంకులో FD చేయాలని ప్లాన్ చేస్తుంటే వడ్డీ రేట్లని గమనించండి.
బ్యాంక్ FD రేట్లు రూ. 2 కోట్ల కంటే తక్కువగా ఉంటే..
7 నుంచి 14 రోజుల FD - 3.50%
15 నుంచి 29 రోజుల FD - 3.50%
30 నుంచి 45 రోజుల FD - 4.00%
46 నుంచి 90 రోజుల FD - 4.00%
91 నుంచి 180 రోజుల FD - 4.50%
181 రోజుల నుంచి 1 సంవత్సరం వరకు FD - 5.75%
1 సంవత్సరం 1 రోజు నుంచి 499 రోజుల FD - 6.25%
500 రోజుల నుంచి 2 సంవత్సరాల FD - 6.50%
2 సంవత్సరాల 1 రోజు నుంచి 3 సంవత్సరాల FD-6.50%
3 సంవత్సరాలు 1 రోజు నుంచి 5 సంవత్సరాలు -6.50%
5 సంవత్సరాల 1 రోజు నుంచి 10 సంవత్సరాల FDలపై - 6.00%