EPFO 3.0: పీఎఫ్ డబ్బులు ఏటీఎం ద్వారా ఎలా విత్ డ్రా చేసుకోవాలి.. ప్రైవేటు ఉద్యోగులు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..!!

Update: 2025-05-28 01:30 GMT

EPFO 3.0: పీఎఫ్ డబ్బులు ఏటీఎం ద్వారా ఎలా విత్ డ్రా చేసుకోవాలి.. ప్రైవేటు ఉద్యోగులు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..!!

EPFO 3.0: ఇప్పుడు PF డబ్బును ఉపసంహరించుకోవడానికి చాలా సులభతరం చేస్తూ EPFO పలు మార్పులు తెచ్చింది. మీరు బ్యాంకులో డిపాజిట్ చేసిన డబ్బును ఎలాగైతే ATM నుండి విత్ డ్రా చేసుకుంటారో ఆ విధంగానే మీ PF డబ్బును ఉపసంహరించుకునే అవకాశం కల్పిస్తూ ఈపీఎఫ్ఓ నిర్ణయం తీసుకుంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అతి త్వరలో ఈ సదుపాయం అమలు చేయబోతోంది, దీనిని EPFO 3.0 సంస్కరణలు అని పిలుస్తున్నారు.

EPFO 3.0 అమల్లోకి వచ్చిన తర్వాత, 9 కోట్ల మంది యూజర్ల జీవితాల్లో పెద్ద మార్పు తెచ్చేందుకు సిద్ధం అవుతోంది. కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈ కొత్త రూల్స్ 2025 మే-జూన్ నెలల్లో అమలు చేయనున్నారనే వార్తలు వస్తున్నాయి. మే నెల ముగియబోతోంది, జూన్‌ నెలలో ఈ రూల్స్ అమలు చేయవచ్చని భావిస్తున్నారు.

EPFO 3.0 లో ప్రత్యేకత ఏమిటి?

కొత్త EPFO ప్లాట్‌ఫామ్ ద్వారా లబ్ధిదారులు నేరుగా ATM నుండి డబ్బును విత్‌డ్రా చేసుకోగలరు. EPFO 3.0 లో యూజర్లు ఎలాంటి సదుపాయాలను పొందనున్నారు ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీని ద్వారా ముఖ్యంగా ప్రైవేట్ ఉద్యోగులకు చాలా మేరకు ఉపయోగపడనుంది. ముఖ్యంగా ప్రైవేట్ ఉద్యోగులు అత్యవసర సమయాల్లోనూ, అలాగే రిటైర్మెంట్ అనంతరం ప్రావిడెంట్ ఫండ్ డబ్బులను ఉపసంహరించుకోవాలంటే ఒకప్పుడు చాలా కష్టతరమైన ప్రొసీజర్ అందుబాటులో ఉండేది. ఈ కొత్త రూల్స్ ద్వారా చాలా సులభంగా మీరు డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చు.

క్లెయిమ్‌ ఆటో సెటిల్‌మెంట్: EPFO ఆటో-క్లెయిమ్ సెటిల్‌మెంట్‌ను ప్రవేశపెట్టడం ద్వారా దాని సభ్యులకు క్లెయిమ్ ప్రక్రియను సులభతరం, వేగవంతం చేసింది. ఇందులో ఎవరి జోక్యం లేకుండా క్లెయిమ్‌లను ఆటో సెటిల్‌మెంట్‌ చేయనుంది.

ATM నుండి PF విత్ డ్రాయల్: ఇప్పుడు EPFO చందాదారులు డబ్బును ఉపసంహరించుకోవడానికి బ్యాంకు అకౌంటులో డబ్బులలాగే, మీరు మీ PF డబ్బును ATM నుండి తీసుకోవచ్చు. అయితే ఈ సదుపాయం ఇంకా అందుబాటులోకి రాలేదు. త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

డిజిటల్ సేవలు: ఈపీఎఫ్ సభ్యులు ఇకపై ఎలాంటి మార్పులు చేయాలనుకుంటే ఆన్‌లైన్ ద్వారా సులభంగా మార్చుకోవచ్చు. యూజర్లు ఈ వివరాలను డిజిటల్‌గా సరిచేసుకోవచ్చు. ఆఫీసులకు వెళ్లాల్సిన పనిలేదు.

OTP-ఆథంటిఫికేషన్: లబ్ధిదారుడు ఖాతా వివరాలను ఆప్ డేట్ చేయాల్సి వస్తే, అతను దానిని OTP ఆధారిత ఆథంటిఫికేషన్ ద్వారా చేయవచ్చు. దీనివల్ల పెద్ద పెద్ద ఫారమ్‌లను నింపి సబ్ మిట్ చేయాల్సిన సమయం వృధా చేయాల్సిన పని లేదు.

Digital Updates: EPFO ఇప్పుడు పూర్తిగా డిజిటల్‌గా మారబోతోంది. మీరు మొబైల్ యాప్ ద్వారా మీ PF బ్యాలెన్స్ సమాచారం, ట్రాన్సాక్షన్ స్థితిని ప్రత్యక్షంగా తనిఖీ చేసుకోవచ్చు.

Tags:    

Similar News