Train Booking: మీరు IRCTC ద్వారా ట్రైన్‌లో మొత్తం కోచ్‌నే బుక్ చేయాలనుకుంటున్నారా? అయితే ఇదే ప్రాసెస్..
Train Booking: IRCTC ద్వారా పూర్తి రైలు లేదా కోచ్‌ను బుక్ చేయాలనుకుంటే.. మీ అభ్యర్థనను సమర్పించడానికి FTR పోర్టల్ లేదా స్టేషన్ బుకింగ్ కౌంటర్‌ను ఉపయోగించాలి.
Train Booking: మీరు IRCTC ద్వారా ట్రైన్‌లో మొత్తం కోచ్‌నే బుక్ చేయాలనుకుంటున్నారా? అయితే ఇదే ప్రాసెస్..
Train Booking: IRCTC ద్వారా పూర్తి రైలు లేదా కోచ్‌ను బుక్ చేయాలనుకుంటే.. మీ అభ్యర్థనను సమర్పించడానికి FTR పోర్టల్ లేదా స్టేషన్ బుకింగ్ కౌంటర్‌ను ఉపయోగించాలి. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
భారతదేశంలో రైలు టికెట్టు కొనాలంటే ఒక పెద్ద సవాలే. ముఖ్యంగా ఎక్కువ మొత్తంలో టికెట్లు బుక్ చేయాలంటే మరింత కష్టం. ఎందుకంటే ప్రయాణికుల్లో పెద్దవాళ్లు ఉంటారు. చిన్నపిల్లలు ఉంటారు. వీరికి అనువైన బెర్త్ లను బుక్ చేయడం అంటే సాధ్యమయ్యే పని అసలు కాదు. అయితే ఇప్పుడు చాలా ఈజీ ఒక పెద్ద కోచ్‌ని మీరు బుక్ చేసేయొచ్చు. దీనికోసం.. ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఒక పరిష్కారాన్ని తీసుకొచ్చింది.
మొత్తం రైలు లేదా కోచ్‌ను బుక్ చేయాలనుకుంటే IRCTC యొక్క పూర్తి టారిఫ్ రేట్ (FTR) సేవ ద్వారా ఎలా బుక్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. అయితే ఈ ప్రాసెస్ ఇక్కడ మీకు దశల వారీగా ఇస్తున్నాం.
పూర్తి రైలు లేదా కోచ్‌ను ఎలా బుక్ చేసుకోవాలి (IRCTC FTR)
FTR ఆప్షన్స్
ఇందులో IRCTC మూడు చార్టర్ రకాలను అందిస్తోంది. అవేంటంటే..
రైల్వే కోచ్ చార్టర్ - ఒక పూర్తి కోచ్‌ను బుక్ చేయడం కోసం (18-100 సీట్లు)
రైలు చార్టర్ - మొత్తం రైలును రిజర్వ్ చేయండి కోసం(18 నుండి 24 కోచ్‌లు)
సెలూన్ చార్టర్ - జీవన సౌకర్యాలతో కూడిన విలాసవంతమైన ప్రైవేట్ సెలూన్‌లు
కీ బుకింగ్ విండోస్
రైలు లేదా కోచ్‌ను బుక్ చేసేటపుడు బుకింగ్ 6 నెలల ముందుగానే ప్రారంభమవుతుంది. అదేవిధంగా బయలుదేరే 30 రోజుల ముందు ముగుస్తుంది.
మల్టీ-కోచ్/రైళ్లకు: కనీసం 18 కోచ్‌లు, గరిష్టంగా 24 (2 SLR/జనరేటర్ కార్లను తప్పకుండా కలిగి ఉండాలి)
సెక్యూరిటీ డిపాజిట్
రిజిస్ట్రేషన్ మనీ కమ్ సెక్యూరిటీ డిపాజిట్ (RMSD)గా కోచ్‌కు రూ. 50,000లు చెల్లించాల్సి ఉంటుంది. గరిష్టంగా 24 కోచ్‌ల రైళ్లను చార్టర్ చేయొచ్చు.
బుకింగ్ రిక్వెస్ట్ సబ్మిషన్
IRCTC – FTR పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో (https://www.ftr.irctc.co.in) అనే వెబ్ సైట్‌ను ఓపెన్ చేయాలి. అక్కడ మీ ఖాతాను నమోదు చేసుకోవాలి. అప్పుడు మీకు వచ్చిన OTPని ధృవీకరించాలి. సర్వీస్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. అంటే కోచ్, రైలు లేదా సెలూన్. వీటిలో ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ప్రయాణ వివరాలను అందించాలి. అంటే బయలుదేరు/గమ్యస్థానం, తేదీ, రైలు, కోచ్‌ల సంఖ్య/రకం. ఈ వివరాలన్నీ అక్కడ ఇవ్వాలి. ఆ తర్వాత ప్రయాణికుల జాబితాను అప్‌లోడ్ చేయాలి. అదేవిధంగా డిపాజిట్ చెయాలి.
స్టేషన్ ఆఫీస్ ద్వారా ఆఫ్‌లైన్
రైలు బయలుదేరు లేదా 10 నిమిషాల స్టాప్ ఉన్న స్టేషన్‌లో చీఫ్ రిజర్వేషన్ ఆఫీసర్ లేదా స్టేషన్ మేనేజర్‌ను కలవాలి. అక్కడున్న ఫార్మ్స్ ని పూరించాలి. ప్రయాణీకులందరి ప్రయాణ మరియు గుర్తింపు వివరాలను అందించాలి. అదేవిధంగా డిపాజిట్ + ఛార్జీని చెల్లించాలి.
సాధారణంగా వివాహాలు , కార్పొరేట్ పర్యటనలు, తీర్థయాత్రలకు వెళ్లేటప్పుడు ఇలా పెద్ద ఎత్తున ఎక్కువ మందికి ఒకేసారి బుక్ చేయాల్సి వస్తుంది. అలాంటి సమయంలోఈ ప్రాసెస్ బాగాఉపయోగపడుతుంది.