EPFO: కొవిడ్‌ కారణంగా పీఎఫ్‌ డబ్బుని ఎన్నిసార్లు విత్‌ డ్రా చేయవచ్చు..!

EPFO: కరోనా ఇంకా ముగియలేదు. దేశంలో రోజురోజుకు కొత్త కరోనా కేసులు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి.

Update: 2022-08-10 13:30 GMT

EPFO: కొవిడ్‌ కారణంగా పీఎఫ్‌ డబ్బుని ఎన్నిసార్లు విత్‌ డ్రా చేయవచ్చు..!

EPFO: కరోనా ఇంకా ముగియలేదు. దేశంలో రోజురోజుకు కొత్త కరోనా కేసులు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఈ పరిస్థితిలో ప్రజలు కోవిడ్ చికిత్స కోసం పీఎఫ్‌ ఖాతా నుంచి డబ్బును విత్‌డ్రా చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. కరోనా చికిత్స ఖర్చును తీర్చడానికి ప్రజలు ఈ మొత్తాన్ని ఉపయోగించవచ్చు. అయితే కోవిడ్ కారణంగా పీఎఫ్‌ డబ్బును ఎలా విత్‌ డ్రా చేయాలనే విషయం తెలుసుకోవడం చాలా ముఖ్యం. దాని గురించి తెలుసుకుందాం.

ఈపీఎఫ్‌వో (EPFO)మూడు రోజుల్లో కోవిడ్ అడ్వాన్స్ క్లెయిమ్ చేస్తుంది. అయితే చాలా సార్లు ప్రజలు పీఎఫ్ అడ్వాన్స్ క్లెయిమ్ చేసినా 72 గంటల తర్వాత కూడా అకౌంట్‌లో డబ్బులు జమ కావడం లేదు. ఈ పరిస్థితిలో కోవిడ్-19 మహమ్మారిపై పోరాడేందుకు ఈపీఎఫ్‌వో మూడు రోజులలో అడ్వాన్స్ క్లెయిమ్ పరిష్కరిస్తున్నట్లు ఈపీఎఫ్‌వో తెలిపింది. క్లెయిమ్‌ను ప్రాసెస్ చేసిన తర్వాత ఖాతాలో మొత్తాన్ని క్రెడిట్ చేయడానికి చెక్ బ్యాంక్‌కి పంపుతారు. అదే సమయంలో బ్యాంక్ ఈ చెక్కును ఖాతాలో జమ చేయడానికి సాధారణంగా ఒకటి నుంచి మూడు రోజులు చేస్తుంది. దీని కారణంగా ఆలస్యం అవుతుంది.

ప్రజలు ఆన్‌లైన్‌లో కోవిడ్ అడ్వాన్స్ క్లెయిమ్ స్టేటస్‌ని తెలుసుకోవచ్చు. ఇందుకోసం పీఎఫ్ ఖాతాలోకి లాగిన్ అయి ఆన్‌లైన్ సర్వీసెస్ ఆప్షన్‌లోకి వెళ్లి ట్రాక్ క్లెయిమ్ స్టేటస్‌పై క్లిక్ చేయాలి. దీని తర్వాత మీరు కోవిడ్ అడ్వాన్స్ క్లెయిమ్ స్థితిని చూడవచ్చు. మరోవైపు పీఎఫ్ ఖాతాలో బ్యాలెన్స్ ఉన్నప్పటికీ కోవిడ్‌తో పోరాడటానికి ఒక్కసారి మాత్రమే అడ్వాన్స్ తీసుకోవచ్చనే విషయాన్ని గుర్తు పెట్టుకోండి. మీరు ఉద్యోగం నుంచి నిష్క్రమించినా కోవిడ్ అడ్వాన్స్ ఫైల్ చేయవచ్చు. ఎందుకంటే మీరు ఇప్పటికీ ప్రావిడెంట్ ఫండ్‌లో సభ్యుడిగా ఉన్నారు. అంతేకాదు కోవిడ్ అడ్వాన్స్‌ను ఉమాంగ్ యాప్‌లో కూడా ఫైల్ చేయవచ్చు. కోవిడ్-19 కింద తీసుకున్న అడ్వాన్స్‌లపై ఆదాయపు పన్ను వర్తించదు.

Tags:    

Similar News