Home Loan: హౌసింగ్ లోన్ తీసుకుంటున్నారా? ఇలా చేస్తే లక్షలు ఆదా చేయవచ్చు

Home Loan: స్వంత ఇల్లు ఉండాలనేది ప్రతి ఒక్కరి కల. ఇల్లు కొనుగోలు చేయడం లేదా కట్టుకోవడానికి పెద్ద మొత్తంలో డబ్బులు కావాలి.

Update: 2025-01-24 07:25 GMT

Home Loan: స్వంత ఇల్లు ఉండాలనేది ప్రతి ఒక్కరి కల. ఇల్లు కొనుగోలు చేయడం లేదా కట్టుకోవడానికి పెద్ద మొత్తంలో డబ్బులు కావాలి. కొంత తమ వద్ద సేవింగ్స్ చేసుకున్న డబ్బులతో పాటు బ్యాంకుల నుంచి రుణం తీసుకుంటారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు బ్యాంకుల నుండి హోం లోన్స్ తీసుకుంటారు. అయితే హోంలోన్ తీసుకునే సమయంలో కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలని ఆర్దిక నిపుణులు సూచిస్తున్నారు.

హోంలోన్ ఇవ్వడానికి మీ శాలరీతో పాటు మీ వయస్సు, మీరు ఎంతకాలం ఇంకా ఉద్యోగం చేస్తారనే విషయాలను బ్యాంకు అధికారులు పరిగణనలోకి తీసుకుంటారు. దీని ఆధారంగానే బ్యాంకులు హౌసింగ్ లోన్ ను ఇస్తాయి. మనం కోరుకున్నంత లోన్ కావాలంటే వీటన్నింటిని పరిశీలిస్తారు. క్రెడిట్ స్కోర్ 750 కంటే ఎక్కువగా ఉంటే వడ్డీ రేటు కూడా తక్కువగా ఉంటుంది. క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉంటే కొన్ని హౌసింగ్ లోన్ కూడా రిజెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. అయితే లోన్ కోసం దరఖాస్తు చేయడానికి ముందే క్రెడిట్ స్కోర్ పెంచుకోవాలి.

హౌసింగ్ లోన్ ఎంత తీసుకోవాలి, నెలకు ఎంత పే చేయాలనే దానిపై కూడా స్పష్టత ఉండాలి. వచ్చే ఆదాయంలో 40 శాతానికి మించి ఈఎంఐ పే చేయడానికి నిబంధనలు ఒప్పుకోవు. ఎక్కువ కాలం హౌసింగ్ లోన్ కాల వ్యవధి ఉంటే అంతే మొత్తంలో వడ్డీ భారం కూడా పడుతుంది. కొన్ని బ్యాంకులు కొంత డౌన్ పే మెంట్ ను కూడా వసూలు చేస్తాయి. కొన్ని బ్యాంకులు మాత్రం డౌన్ పేమెంట్ ను వసూలు చేయవు. డౌన్ పేమెంట్ వసూలు చేస్తే కొంత భారం తగ్గుతుంది. ఎక్కువ డౌన్ పేమెంట్ చేస్తే వడ్డీ రేటు తగ్గుతుంది. ఇది రుణం తీసుకొన్నవారికి కలిసి వస్తుంది.

ప్రతి నెల వచ్చే ఆదాయం ఆధారంగా ఈఎంఐలతో పాటు సేవింగ్స్, పెట్టుబడి పెట్టాలి. ఆదాయంలో 50 శాతం ఈఎంఐలు,ఇతర ఖర్చుల కోసం ఉపయోగించాలి. 30 శాతం ఇతర ఖర్చుల కోసం మిగిలిన 20 శాతాన్ని సేవింగ్స్, పెట్టుబడి కోసం ఖర్చు చేయాలి. ఈ 20 శాతం ఆదాయంలో పెట్టిన పెట్టుబడి హోంలోన్ తీర్చేందుకు ఉపయోగపడనుంది.

హోంలోన్ త్వరగా తీరడానికి ప్రతి ఏటా ఒక్క ఈఎంఐ లేదా ఇబ్బంది లేకపోతే ఒకటి కంటే ఎక్కువ ఈఎంఐలు చెల్లిస్తే అసలు భారం తగ్గనుంది. ప్రతి ఏటా ఈఎంఐను ఆదాయాన్ని బట్టి 5 లేదా 10 శాతం పెంచుకునే వెసులుబాటు కూడా ఉంది. ఇలా చేసినా కూడా లోన్ త్వరగా తీర్చవచ్చు.

Tags:    

Similar News