కారు కొనాలని ఐడియా ఉందా..! లోన్, వడ్డీ, EMI గురించి తెలుసుకోండి..

Car Loan: చాలామంది మధ్యతరగతి ప్రజలు ఎప్పటినుంచో కారు కొనాలని కలలు కంటారు

Update: 2021-11-23 15:00 GMT

Representational Image

Car Loan: చాలామంది మధ్యతరగతి ప్రజలు ఎప్పటినుంచో కారు కొనాలని కలలు కంటారు. అయితే అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఇప్పుడు అన్ని బ్యాంకులు కారులోన్లని అందిస్తున్నాయి. కానీ ఇందులో ఒక్కో బ్యాంకు రేట్లు ఒక్కో విధంగా ఉన్నాయి. ఇందులో సరైనది ఎంపిక చేసుకోవడం కొంచెం కష్టంతో కూడుకున్న పనే. కానీ ప్రయత్నిస్తే కచ్చితంగా తెలుసుకోవచ్చు. కార్ లోన్లు సాధారణంగా మూడు నుంచి ఐదు సంవత్సరాల వరకు ఉంటాయి. కొంతమంది రుణదాతలు అనేక సంవత్సరాల కాలవ్యవధితో కారు రుణాలను కూడా అందిస్తారు.

దీర్ఘకాలిక లోన్ తీసుకోవడం ద్వారా మీరు తక్కువ EMI చెల్లించాల్సి ఉంటుందని భావిస్తే ఎక్కువ వడ్డీని చెల్లించవలసి ఉంటుంది. కారు ఖరీదు తగ్గితే రుణం తీసుకోవడం అంత మంచిది కాదన్న విషయం మర్చిపోవద్దు. కానీ మీరు తక్కువ వ్యవధిలో రుణం తీసుకుంటే EMI ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు కొన్ని బ్యాంకులు కారు పూర్తి ఎక్స్-షోరూమ్ ధరకు రుణాలను అందిస్తాయి. ఇతర బ్యాంకులు 80 శాతం వరకు రుణాలు ఇవ్వవచ్చు. కారు రుణంపై వడ్డీ రేటుతో పాటు, ప్రాసెసింగ్ ఫీజు, ఇతర ఛార్జీలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. వివిధ బ్యాంకులు అందిస్తున్న వడ్డీరేట్టు, EMIలను పరిశీలించండి.

1. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB)

2. వడ్డీ రేటు: 6.65 శాతం నుంచి 8.75 శాతం

EMI: రూ.1,964 నుంచి 2,064

ప్రాసెసింగ్ రుసుము: ప్రాసెసింగ్ రుసుము డిసెంబర్ 31, 2021 వరకు మినహాయించారు.

2. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్

వడ్డీ రేటు: 6.80 శాతం నుంచి 7.90 శాతం

EMI: రూ. 1,971 నుండి 2,023

ప్రాసెసింగ్ ఫీజు: లోన్ మొత్తంలో 0.25 శాతం (కనీసం రూ. 1,000 నుండి రూ. 2,023)

3. బ్యాంక్ ఆఫ్ ఇండియా

వడ్డీ రేటు: 6.85 శాతం నుంచి 8.55 శాతం

EMI: రూ. 1,973 నుండి 2,054

ప్రాసెసింగ్ రుసుము: బ్యాంక్ డిసెంబర్ 31, 2021 వరకు ప్రాసెసింగ్ ఫీజును మాఫీ చేసింది.

4. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

వడ్డీ రేటు: 7.15 శాతం నుంచి 7.50 శాతం

EMI: రూ. 1,987 నుంచి 2,004

ప్రాసెసింగ్ ఫీజు: రూ. 1,000

5. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)

వడ్డీ రేటు: 7.25 శాతం నుంచి 7.95 శాతం

EMI: రూ. 1,992 నుంచి 2,025

వరకు ప్రాసెసింగ్ ఫీజు: డిసెంబర్ 31, 2021 వరకు మినహాయింపు.

Tags:    

Similar News