Google: గూగుల్‌ కూడా సిద్దమైంది.. 10,000 మంది ఉద్యోగులు ఔట్‌..

Google: గూగుల్‌ కూడా సిద్దమైంది.. 10,000 మంది ఉద్యోగులు ఔట్‌..

Update: 2022-11-23 05:53 GMT

Google: గూగుల్‌ కూడా సిద్దమైంది.. 10,000 మంది ఉద్యోగులు ఔట్‌..

Google: ప్రపంచ ప్రఖ్యాతి పొందిన టెక్‌ దిగ్గజాలన్ని ఇప్పుడు ఉద్యోగుల తొలగింపు ప్రక్రియని చేపట్టాయి. ట్విట్టర్ తర్వాత ఈ లిస్టులో గూగుల్‌ కూడా చేరింది. గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ దాదాపు 10,000 మంది ఉద్యోగులను తొలగించాలని యోచిస్తోంది. మీడియా నివేదికల ప్రకారం.. కంపెనీ తన ఉద్యోగుల పనితీరును సమీక్షిస్తోంది. ఇందులో పని తీరు బాగాలేని ఉద్యోగులను తొలగించనున్నారు. ప్రస్తుతం ప్రపంచంలోని ఇతర పెద్ద టెక్ కంపెనీల మాదిరిగానే గూగుల్ కూడా తన ఖర్చును తగ్గించుకునే పనిలో పడింది. ఉద్యోగుల సంఖ్యను తగ్గించడం ద్వారా దీనిని కవర్‌ చేస్తుంది.

6 శాతం ఉద్యోగులు ఔట్‌

ప్రతి 100 మంది ఉద్యోగులలో 6 మందిని తొలగించడానికి కంపెనీ ప్రయత్నం చేస్తోంది. దాదాపు ఇది 10 వేల మంది ఉద్యోగులకు సమానం. దీని కోసం గూగుల్ ర్యాంకింగ్ సిస్టమ్‌ను ఉపయోగిస్తుంది. అత్యల్ప ర్యాంక్ ఉద్యోగులని తొలగిస్తుంది. విశేషమేమిటంటే కొంతకాలం క్రితం గూగుల్ పెద్ద సంఖ్యలో వ్యక్తులను రిక్రూట్ చేసుకుంది. తర్వాత నిపుణులు, పెట్టుబడిదారులు పెరుగుతున్న ధరల గురించి కంపెనీ యాజమాన్యాన్ని హెచ్చరించడం ప్రారంభించారు.

ఇటీవల జరిగిన రిక్రూట్‌మెంట్‌లు కంపెనీ అవసరాల కంటే ఎక్కువగా ఉన్నాయి. దీంతో నాల్గవ త్రైమాసికంలో రిక్రూట్‌మెంట్ వేగాన్ని తగ్గిస్తామని గూగుల్ ప్రకటించింది. అయితే ఆ పని ఇప్పుడు త్రైమాసికంలోనే ప్రారంభిస్తోంది. కంపెనీలో అవసరమైన దానికంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్నారని వారిని సంఖ్యను తగ్గించాల్సిన అవసరం ఉందని గూగుల్‌ నిర్ణయించింది. 2021 సంవత్సరంలో Google ఉద్యోగుల సగటు జీతం దాదాపు $ 3 లక్షలు అంటే సంవత్సరానికి రూ. 2 కోట్ల కంటే ఎక్కువ. ఒక నివేదిక ప్రకారం ఆల్ఫాబెట్ అమెరికాలోని టాప్ టెక్ కంపెనీల కంటే ఒకటిన్నర రెట్లు ఎక్కువ జీతం చెల్లిస్తోంది.

Tags:    

Similar News