సీనియర్‌ సిటిజన్లకి గుడ్‌ న్యూస్‌.. ఎస్బీఐ ఈ స్కీంని మరింత పొడిగించింది..!

సీనియర్‌ సిటిజన్లకి గుడ్‌ న్యూస్‌.. ఎస్బీఐ ఈ స్కీంని మరింత పొడిగించింది..!

Update: 2022-09-23 16:00 GMT

సీనియర్‌ సిటిజన్లకి గుడ్‌ న్యూస్‌.. ఎస్బీఐ ఈ స్కీంని మరింత పొడిగించింది..!

SBI Wecare: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఖాతా ఉన్న సీనియర్‌ సిటిజన్లకి ఇది శుభవార్తనే చెప్పొచ్చు. ఎందుకంటే ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ అయిన 'SBI వీకేర్' కాలాన్ని పొడిగించింది. ఇప్పుడు ఈ పథకాన్ని వచ్చే ఏడాది మార్చి 31 వరకు తీసుకోవచ్చు. కరోనా సమయంలో ఎస్బీఐ ఈ పథకాన్ని ప్రారంభించింది. గతంలో కూడా ఈ పథకాన్ని పలుమార్లు పెంచుతూ వచ్చింది. SBI వీకేర్ స్కీమ్‌లో సీనియర్ సిటిజన్లకి అదనంగా 30 బేసిస్ పాయింట్ల వడ్డీ చెల్లిస్తున్నారు.

ఈ అదనపు వడ్డీ 5 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ మెచ్యూరిటీ టర్మ్ డిపాజిట్ పథకాలపై చెల్లిస్తారు. మే 2020లో ఎస్బీఐ WeCare FD పథకాన్ని ప్రారంభించింది. సీనియర్ సిటిజన్లకు ఆర్థిక ప్రయోజనాలను అందించడానికి ఈ పథకం ప్రారంభించారు. తర్వాత చాలా సార్లు దీనిని పొడిగించారు. ఈ పథకం కింద 5 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ FDలపై అదనంగా 30 బేసిస్ పాయింట్ల వడ్డీ చెల్లిస్తారు.

ప్రస్తుతం SBI 5 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ FDలపై సాధారణ ప్రజలకు 5.65 శాతం వడ్డీని అందిస్తోంది. సీనియర్ సిటిజన్లు వీకేర్ స్పెషల్ ఎఫ్‌డి స్కీమ్‌లో అదే కాలానికి 6.45 శాతం వడ్డీ లభిస్తుంది. కొత్త రేట్లు జనవరి 8, 2021 నుంచి వర్తిస్తాయి. కరోనా సమయంలో చాలమంది సీనియర్‌ సిటిజన్లు ఇందులో పెట్టుబడి పెట్టారు. ఈ స్కీం డిమాండ్, ప్రజాదరణను దృష్టిలో ఉంచుకుని వచ్చే ఏడాది మార్చి వరకు పొడిగించాలని బ్యాంకు నిర్ణయించింది.

అమృత్ మహోత్సవ్‌లో భాగంగా కొత్త పథకం

ఇదిలా ఉంటే 76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎస్బీఐ ఉత్సవ్ డిపాజిట్ పథకాన్ని ప్రారంభించింది. ఇది 15 ఆగస్టు 2022 నుంచి 28 అక్టోబర్ 2023 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ FD స్కీమ్‌లో పెట్టుబడి పెడితే కస్టమర్‌లు 6.1 శాతం వడ్డీని పొందుతారు. సీనియర్ సిటిజన్లు, ఎస్‌బిఐ సిబ్బంది, పెన్షనర్లకి సాధారణ ప్రజల కంటే ఎక్కువ వడ్డీని చెల్లిస్తారు.

Tags:    

Similar News