SBI Customers: ఎస్బీఐ ఖాతాదారులకు గుడ్‌న్యూస్..స్పెషల్ ఆఫర్ జనవరి 31, 2024 వరకు మాత్రమే..!
SBI Customers: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఖాతాదారులకు ఇది శుభవార్తని చెప్పాలి.
SBI Customers: ఎస్బీఐ ఖాతాదారులకు గుడ్‌న్యూస్..స్పెషల్ ఆఫర్ జనవరి 31, 2024 వరకు మాత్రమే..!
SBI Customers: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఖాతాదారులకు ఇది శుభవార్తని చెప్పాలి. కొత్తగా కారు కొనాలని ప్లాన్ చేస్తున్న వారికి స్పెషల్ గిఫ్ట్ అందించింది. పండుగ సీజన్ పురస్కరించుకొని తన కస్టమర్ల కోసం కొత్త ఆఫర్‌ను తీసుకొచ్చింది. కార్ లోన్ తీసుకునేవారు ఇక నుంచి ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. దీనివల్ల చాలా డబ్బులు ఆదా చేసుకోవచ్చు. ఈ సమాచారాన్ని ఎస్బీఐ ట్విటర్ ద్వారా తెలియజేసింది.
జనవరి 31 వరకు ఆఫర్
ఎస్బీఐ ప్రకారం ఫెస్టివల్ ఆఫర్ కింద కార్ లోన్ కస్టమర్ల నుంచి ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేయదు. ఈ ఆఫర్ జనవరి 31, 2024 వరకు అమలులో ఉంటుంది. ఆటోలోన్‌పై ఎస్బీఐ ఒక సంవత్సరం MCLR జారీ చేస్తుంది. ప్రస్తుతం ఇది 8.55 శాతంగా ఉంది. ఏదైనా కస్టమర్‌కు కారు లోన్ ఇస్తే కనీసం 8.55 శాతం వడ్డీ రేటును వసూలు చేస్తుంది. ప్రస్తుతం ఎస్బీఐ కార్ లోన్ 8.80 శాతం నుంచి 9.70 శాతంగా ఉంటుంది. ఎస్బీఐ రుణాలపై వడ్డీ రేట్లు కస్టమర్ సిబిల్ స్కోర్ ప్రకారం నిర్ణయిస్తారు.
కారు లోన్ కోసం అవసరమైన పత్రాలు
>> గత 6 నెలల బ్యాంక్ ఖాతా వివరాలు
>> 2 పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు
>> నివాస ధృవీకరణ పత్రం
>> సాలరీ స్లిప్‌తో ఫారం-16
>> గత 2 సంవత్సరాల ఐటీఆర్ రిటర్న్
>> పాస్‌పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్