ఆ బ్యాంకులో ఆ అకౌంట్‌ ఓపెన్ చేస్తే ఉచితంగా 20 లక్షల ప్రయోజనం..!

ఆ బ్యాంకులో ఆ అకౌంట్‌ ఓపెన్ చేస్తే ఉచితంగా 20 లక్షల ప్రయోజనం..!

Update: 2022-04-20 06:34 GMT

ఆ బ్యాంకులో ఆ అకౌంట్‌ ఓపెన్ చేస్తే ఉచితంగా 20 లక్షల ప్రయోజనం..!

PNB My Salary: పంజాబ్ నేషనల్ బ్యాంక్ కస్టమర్లకు ఇది గుడ్‌న్యూస్‌ అని చెప్పాలి. మీరు పూర్తిగా 20 లక్షల రూపాయల ప్రయోజనాన్ని ఉచితంగా పొందుతారు. మీరు ఉద్యోగం చేస్తున్నట్లయితే పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో PNB My Salary అకౌంట్‌ ఓపెన్ చేయాలి. ఈ అకౌంట్ ద్వారా అనేక సౌకర్యాలు పొందుతారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం. PNB ప్రకారం 'మీరు మీ జీతం కోసం 'PNB My Salary అకౌంట్' ఓపెన్ చేయండి. దీని కింద ఎవరికైనా వ్యక్తిగత ప్రమాదం జరిగితే బీమాతో పాటు ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది'

20 లక్షల ప్రయోజనం

PNB సాలరీ అకౌంట్‌ హోల్డర్స్‌కి ఇన్సూరెన్స్ కవర్‌తో సహా మరెన్నో ప్రయోజనాలను కల్పిస్తోంది. జీరో బ్యాలెన్స్‌తో సాలరీ ఖాతాను తెరిచినప్పుడు రూ. 20 లక్షల వ్యక్తిగత ప్రమాద కవర్ ఉంటుంది. ఇందులో నెలవారీ వేతనం 10 వేల నుంచి 25 వేల వరకు ఉన్నవారిని 'సిల్వర్' కేటగిరీలో ఉంచారు. నెలవారీ జీతం రూ.25001 నుంచి 75000 వరకు ఉన్నవారిని 'గోల్డ్' కేటగిరీలో ఉంచారు. రూ.75001 నుంచి రూ.150000 వరకు నెలవారీ జీతం ఉన్నవారిని 'ప్రీమియం' కేటగిరీలో ఉంచారు. నెలవారీ వేతనం రూ.150001 కంటే ఎక్కువ ఉన్నవారిని 'ప్లాటినం' కేటగిరీలో ఉంచారు.

మీకు ఎలాంటి ప్రయోజనం లభిస్తుందంటే..

బ్యాంకు ఖాతాదారులకు ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం ఉంటుంది. సిల్వర్ కేటగిరీ వ్యక్తులు రూ. 50,000 వరకు ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం పొందుతారు. గోల్డ్‌ కేటగిరీలో ఉన్నవారు రూ.150000 వరకు ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం పొందుతారు. ప్రీమియం వ్యక్తులు రూ.225000 వరకు ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం పొందుతారు. ప్లాటినం వ్యక్తులు రూ.300000 వరకు ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం పొందుతారు. 

Tags:    

Similar News