Pensioners: పెన్షనర్లకి గుడ్‌న్యూస్‌.. ఈ పనికి ఎటువంటి ఇబ్బంది లేదు..!

Pensioners: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) పెన్షనర్లకు పెద్ద ఉపశమనం కలిగించింది.

Update: 2022-09-02 11:34 GMT

Pensioners: పెన్షనర్లకి గుడ్‌న్యూస్‌.. ఈ పనికి ఎటువంటి ఇబ్బంది లేదు..!

Pensioners: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) పెన్షనర్లకు పెద్ద ఉపశమనం కలిగించింది. EPS'95 పెన్షనర్లు ఎప్పుడైనా లైఫ్ సర్టిఫికేట్‌ను సమర్పించవచ్చని తెలిపింది. ఈ పత్రం సమర్పించిన తేదీ నుంచి ఒక సంవత్సరం పాటు చెల్లుబాటు అవుతుంది. ఇంతకుముందు పెన్షనర్లు నిర్దిష్ట కాలానికి లైఫ్ సర్టిఫికేట్‌లను సమర్పించాల్సి ఉండేది. లేదంటే పలుమార్లు పింఛన్‌ నిలిచిపోయే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి నుంచి ఉపశమనం లభించింది.

ఇప్పుడు పెన్షనర్లు లైఫ్‌ సర్టిఫికెట్‌ సమర్పించడానికి బ్యాంకు లేదా పెన్షన్ ఏజెన్సీకి వెళ్లవలసిన అవసరం లేదు. దీన్ని ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు. మీరు ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో చేసినా లైఫ్ సర్టిఫికేట్ పూర్తిగా చెల్లుబాటు అవుతుంది. పెన్షనర్లు జీవిత ధృవీకరణ పత్రాన్ని ఈపీఎఫ్‌వో ప్రాంతీయ కార్యాలయం, జిల్లా కార్యాలయాలలో, అలాగే పెన్షన్ డిస్బర్సింగ్ బ్యాంక్ బ్రాంచ్, సమీప పోస్టాఫీసులో సమర్పించవచ్చు. ఇది కాకుండా UMANG యాప్ ద్వారా కామన్ సర్వీస్ సెంటర్‌లో డిపాజిట్ చేయవచ్చు.

ఆన్‌లైన్ లైఫ్ సర్టిఫికేట్‌ను సమర్పించడానికి పెన్షనర్ తప్పనిసరిగా PPO నంబర్, ఆధార్ నంబర్, బ్యాంక్ ఖాతా వివరాలు, ఆధార్ లింక్డ్ మొబైల్ నంబర్ కలిగి ఉండాలి. ఎవరైనా పెన్షనర్ దాని కోసం వెళ్లలేకపోతే డోర్‌స్టెప్ సర్వీస్ అందుబాటులో ఉంది. డోర్‌స్టెప్ సేవ పోస్టాఫీసు లేదా బ్యాంకుల వద్ద అందుబాటులో ఉంటుంది. ఇందులో పోస్ట్‌మ్యాన్ లేదా బ్యాంకు ఉద్యోగి పెన్షనర్ వద్దకు వెళ్లి లైఫ్ సర్టిఫికెట్‌ను తీసుకొస్తారు. ఇందుకోసం ముందుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News