Gold Price Today: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

Gold Price Today: బంగారం ధరలు భారీగా పెరగ్గా... వెండి ధరలు కూడా బంగారం బాటలోనే పయనిస్తున్నాయి.

Update: 2021-05-05 01:21 GMT

Gold, Silver Price Today:(File Image)

Gold Price Today: బంగారం ధరలు భారీగా పెరిగాయి. నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర ఈ ఉదయానికి (నేటి బులియన్ మార్కెట్ ప్రారంభానికి ముందు) 10 గ్రాములు రూ.44,200 ఉంది. నిన్న ధర రూ.200 పెరిగింది. తులం బంగారం ధర ప్రస్తుతం రూ.35,360 ఉంది. నిన్న తులం ధర రూ.160 పెరిగింది. ఒక్క గ్రాము కావాలంటే దాని ధర రూ.4,420 ఉంది. అలాగే పెట్టుబడులకు వాడే 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర 10 గ్రాములు ఈ ఉదయానికి రూ.48,220 ఉంది. నిన్న ధర రూ.220 పెరిగింది. తులం బంగారం ధర రూ.38,576 ఉంది. నిన్న తులం ధర రూ.176 పెరిగింది. ఒక్క గ్రాము ధర రూ.4,822 ఉంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో...

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,780 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,570 ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,570 ఉండగా,24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,570 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,520 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,570 ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,520 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,980 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,220 వద్ద కొనసాగుతోంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,220 ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో...

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,200 ఉంది.

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 44,200 ఉండగా, 24 క్యారెట్ల 48,220 వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలు...

దేశంలో బంగారం బాటలోనే వెండి పయనిస్తోంది. గత కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తున్న వెండి ధర.. తాజాగా పరుగులు పెడుతోంది. అయితే బంగారం, వెండి ధరలు తగ్గే అవకాశం ఉందని కొందరు చెబుతుండగా, దీపావళి నాటికి పెరిగే అవకాశాలున్నాయిన మరి కొందరు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. బుధవారం దేశీయంగా కిలో వెండి ధరపై రూ.250 మేర పెరిగింది. అయితే దేశంలో కొన్ని ప్రాంతాల్లో వెండి ధరలు నిలకడగా ఉండగా, కొన్ని ప్రాంతాల్లో పెరిగింది.

దేశంలో వివిధ నగరాల్లో...

బంగారం బాటలోనే వెండి కూడా నడిచింది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.70, 000 ఉండగా, దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రూ.70,000 ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.75,300 ఉండగా, కోల్‌కతాలో రూ.70,000 ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.70,000 ఉండగా, కేరళలో రూ.70,000 ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో...

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.75,300 ఉండగా, విజయవాడలో రూ.75,300 ఉంది.

గమనిక: ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 05-05-2021 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News