Gold: బంగారాన్ని సేఫ్ హెవన్ అని ఎందుకంటారు? ప్రపంచమార్కెట్‌లో ఎవర్ గ్రీన్ హీరో!
Gold: బంగారాన్ని సేఫ్ హెవన్ అని ఎందుకంటారు? ప్రపంచమార్కెట్‌లో ఎవర్ గ్రీన్ హీరో!
Gold: ప్రపంచం ఎప్పటికప్పుడు మారిపోతుంటుంది.. మార్కెట్లు తడబడుతున్నాయ్.. డబ్బు విలువ ఊగిసలాడుతోంది.. యుద్ధ భయాలు పుట్టుకొస్తున్నాయ్.. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎవర్ని నమ్మాలి..? డబ్బా..? డాలరా..? షేర్లా..? కాదు కాదు.. ఇవేవీ కాదు..! ఓ వస్తువు ఉంది.. అది దేశాలకే కాదు.. ప్రజలకూ నమ్మకంగా ఉంటుంది... అదే బంగారం...! అందుకే ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ బంగారంవైపే చూస్తున్నాయ్.. పెట్టుబడిదారులు కూడా దాని వెనుకే పెడుతున్నారు. ఎందుకంటే ఇదే సేఫ్ హవెన్ అసెట్. అంటే.. సంక్షోభం వచ్చినా, మార్కెట్లు కుదేలైనా.. బంగారం మాత్రం ఎవర్‌గ్రీన్ హీరోగా నిలపడుతుంది. ఇక ఈ సేఫ్ హెవెన్ అసెట్ అంటే ఏంటి?
సేవ్ హెవెన్ అసెట్ అంటే సంక్షోభ సమయంలో మన సంపదను భద్రంగా నిలుపుకునే ఆస్తి. దీన్ని చరిత్రలో ఎన్నో సార్లు మనం ప్రత్యక్షంగా చూశాం. ప్రపంచ యుద్ధాలు జరిగినప్పుడే కాదు.. 2008లో ఆర్థిక మాంద్యం సమయంలోనూ.. 2020 తర్వాత కోవిడ్ సమయంలోనూ, స్టాక్ మార్కెట్లు పడిపోయిన ప్రతీసారీ... బంగారమే ఇన్‌వెస్టర్లను కాపాడింది.
ఎందుకంటే బంగారంపై ప్రజలకు నమ్మకం చాలా చాలా ఎక్కువ. గోల్డ్‌కి ఉన్న విలువ కేవలం మార్కెట్‌లో నిర్ణయించేలా ఉండదు.. దానికి ఓ సాంస్కృతిక, చారిత్రక నేపథ్యం కూడా ఉంది. అందుకే కేంద్ర బ్యాంకులు సైతం తమ రిజర్వుల్లో డాలర్ల కన్నా ఎక్కువగా బంగారాన్నే నిల్వ చేసుకుంటాయి. అందుకే బంగారాన్ని 'సేవ్ హవెన్ అసెట్' అని పిలుస్తారు.