Today Gold Rates: బంగారం ధరలు ఆకాశానికి టచ్, రేపు ఏమవుతుంది?
హద్దే లేకుండా పరుగులు పెడుతున్న పసిడి గోల్డ్ రేస్ చూసి షాక్ గురవుతున్న సామాన్యుడు గోల్డ్ రేస్ ఇలాగే కంటిన్యూ అవుతుందా ..?
Today Gold Rates: బంగారం ధరలు ఆకాశానికి టచ్, రేపు ఏమవుతుంది?
పసిడి ఇప్పుడు తెగ మిడిసిపడుతోంది. తగ్గేదేలే అంటూ చెలరేగుతోంది. ఆకాశమే హద్దుగా తులం బంగారం రోజుకో ఆల్ టైం హై టచ్ చేస్తోంది. అసలు పసిడి పరుగు ఎక్కడ ఆగుతుంది. తులం లఓన్నర టచ్ చేస్తుందా..? మళ్లీ వెనక్కువస్తుందా..? సామాన్యుడికి దూరమైన స్వర్ణం మళ్లీ దిగివస్తుందా..?
బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. రోజు రోజుకూ సరికొత్త శిఖరాలకు చేరుతూ సామాన్యుడికి చుక్కలు చూపుతోంది. పెళ్లిళ్లు, శుభకార్యాలకూ బంగారం కొనాలన్నా సగటు వినియోగదారుడిని ఊరిస్తూ ఆపై ఉసూరుమనిపిస్తోంది. లక్ష రూపాయలు దాటినా గోల్డ్ రేస్ కు బ్రేక్ పడటం లేదు. లక్షన్నరే లక్ష్యంగా ముందుకు వెళుతున్న బంగారం ఎక్కడ ఆగుతుందనేది అంతుబట్టడం లేదు.
24 క్యారెట్ల మేలిమి బంగారం ఏకంగా 1,23,000 టచ్ చేయడంతో పసిడి ప్రస్ధానం అందరిలోనూ గుబులు రేపుతోంది. బంగారం ధరలు ఇలానే దూసుకెళతాయా లేకుంటే కరెఓన్ తప్పదా అన్న ప్రశ్నలు అందరి మదిలో మెదులుతున్నాయి. గోల్డ్ రేస్ నిలకడగా కొనసాగితే మున్ముందు యల్లో మెటల్ ను కొనుగోలు చేయడం కష్టమనే భయంతో అవసరానికి కొనుగోలు చేయక తప్పని వారు అధిక ధరలకూ కొద్దిమొత్తంలో కొనుగోలు చేయకతప్పడం లేదు. బంగారంలో మదుపుదారులు పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడంతో పాటు అనిశ్చిత పరిస్ధితుల్లో సెంట్రల్ బ్యాంకులూ బంగారాన్నే నమ్ముకోవడంతో బంగారం భగ్గుమంటోంది.
యల్లోమెటల్ ధరలు ఎల్లలు దాటడం వెనుక ఎన్నో కారణాలున్నాయి. స్టాక్ మార్కెట్లు, కరెన్సీల పతనంతో పాటు రియల్ ఎస్టేట్, గ్లోబల్ స్లోడౌన్, రాజకీయ భౌగోళిక ఆర్ధిక అనిశ్చతి వాతావరణం కూడా పసిడి మిడిసిపాటుకు కలిసివచ్చాయని అనలిస్టులు అంచనా వేస్తున్నారు. అయితే గోల్డ్ రేస్ కు ఎక్కడ బ్రేక్ పడుతుందనేదే ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది.