Gold Rates: స్వల్పంగా పెరిగిన బంగారం.. వెండిదీ అదే దారి!

gold-rates-today-25-01-2020-gold-rates-increased-silver-rates-gold-rates-hyderabad-delhi-vijayawada-amaravathi

Update: 2020-01-25 01:44 GMT

సహజంగానే ఎక్కువ ఒడిదుడుకులకు లోనవుతుండే బంగారం వెండి ధరలు ఇటీవలి కాలంలో పైకీ, కిందికీ కదలాడుతూ వస్తున్నాయి. మొన్న కిందకు దిగివచ్చిన బంగారం ధరలు నిన్న కొద్దిగా పైకెగసిన విషయం తెలిసిందే. ఈరోజు కూడా బంగారం ధరలు కొద్దిగా పైచూపు చూశాయి. అయితే, ఇది అతి స్వల్పం కావడం గమనార్హం. బంగారం ధరలు ఈరోజు  (25.01.2020) మళ్లీ పైకెగాశాయి.

స్వల్పంగా పెరిగిన బంగారం..


మార్కెట్లో శుక్రవారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం పది గ్రాములకు 50 రూపాయలు పెరిగింది. దీంతో 24 క్యారెట్ల బంగారం పది గ్రాములకు 41,610 నుంచి 41,660 రూపాయలకు ఎగసింది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా అదేస్థాయిలో పెరుగుదల నమోదు చేసింది. పది గ్రాములకు 40 రూపాయలు పెరగడంతో  38,150 నుంచి 38,190 రూపాయల వద్దకు చేరుకుంది.

వెండి ధరలూ అదే దారిలో..


బంగారం ధరలు దారిలోనే వెండి ధరలు కూడా స్వల్పంగా పెరిగాయి. దీంతో వెండి ధరలు కేజీకి 60 రూపాయల పెరుగుదల నమోదు చేశాయి. . దీంతో కేజీ వెండిధర 49,000 రూపాయల నుంచి 49,060 రూపాయలకు చేరుకుంది. 

విజయవాడ, విశాఖపట్నం లోనూ ఇదేవిధంగా..

విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు అదేవిధంగా ఉన్నాయి. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 41,6160 రూపాయలు, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 38,190 రూపాయలుగా నమోదయ్యాయి. ఇక ఇక్కడ కూడా వెండి ధర స్వల్పంగా పెరిగి 49,060 రూపాయల వద్ద నిలిచింది.

దేశరాజధాని ఢిల్లీలోనూ..


కాగా, ఢిల్లీ మార్కెట్ లో కూడా బంగారం ధరలు పైకెగాశాయి. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ఇక్కడా 50 రూపాయలు పెరిగింది. దీంతో ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం 40,200 రూపాయల వద్దకు చేరుకుంది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 50 రూపాయల పెరుగుదల నమోదు చేసి 39,000 రూపాయలకు చేరింది. ఇక వెండి ధర ఇక్కడా స్వల్పంగా పెరిగింది.  దాంతో వెండి ధర కేజీకి 49,060 రూపాయలుగా ఉంది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 25.01.2020 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా..దేశీయంగా వాణిజ్య విపణిలో బంగారం..వెండి ధరలు ఎప్పటికప్పుడు మార్పులకు గురవుతుంటాయి. వాటి ఆధారంగా ధరల్లో స్థానికంగా హెచ్చుతగ్గులు ఉండవచ్చును.


Tags:    

Similar News