స్థిరంగా బంగారం ధరలు.. స్వల్పంగా పెరిగిన వెండి!
బంగారం ధరలు ఈరోజు (17-12-2019) మిశ్రమంగా కదిలాయి. 24 క్యారెట్ల బంగారం ధరల్లో మార్పు లేదు. కానీ, 22 క్యారెట్ల బంగారం స్వల్పంగా తగ్గింది.
నిన్న స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు ఈరోజు మిశ్రమంగా కదిలాయి. 24 క్యారెట్ల బంగారం ధరల్లో మార్పులు చోటుచేసుకోలేదు. కానీ, 22 క్యారెట్ల బంగారం మాత్రం పది గ్రాములకు 70 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. మరోవైపు వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి.
మంగళవారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర స్థిరంగా ఉంది. దీంతో 39,500 రూపాయల వద్ద నిలిచింది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర మాత్రం 70 రూపాయల తగ్గుదలతో 36,150 రూపాయల వద్దకు చేరింది. అయితే, వెండి ధర కూడా స్వల్పంగా కేజీకి 10 రూపాయలు తగ్గింది. దీంతో హైదరాబాద్ లో కేజీ వెండి ధర 46,690 వద్ద నిలింది.
ఇక విజయవాడ, విశాఖపట్నం లలో కూడా బంగారం ధరలు అదేవిధంగా ఉన్నాయి. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 39,500 రూపాయలు, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 36,170 రూపాయలుగా నమోదయ్యాయి.
కాగా, ఢిల్లీ మార్కెట్ లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం 38,100 రూపాయల వద్ద నిలకడగా ఉంది . అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 36,900 రూపాయల వద్ద నిలిచింది. ఇక వెండి ధర ఇక్కడా స్వల్పంగా కేజీకి 10 రూపాయలు తగ్గింది. దీంతో వెండి కేజీకి 46,690 రూపాయల వద్ద నిలిచింది.
ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 17.12.2019 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా..దేశీయంగా వాణిజ్య విపణిలో బంగారం..వెండి ధరలు ఎప్పటికప్పుడు మర్పులకుగురవుతుంటాయి. వాటి ఆధారంగా ధరల్లో స్థానికంగా హెచ్చుతగ్గులు ఉండవచ్చును.