స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు
రెండు రోజులుగా నిలకడగా ఉన్న బంగారం ధరలు ఈరోజు స్వల్పంగా పెరిగాయి. మరోవైపు వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి.
రెండు రోజులుగా నిలకడగా ఉన్న బంగారం ధరలు ఈరోజు స్వల్పంగా పెరిగాయి. మరోవైపు వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ఆదివారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 310 రూపాయలు పెరిగింది. దీంతో 39,500 రూపాయల వద్ద నిలిచింది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 310 రూపాయల పెరుగుదల తో 36,220 రూపాయల వద్దకు చేరింది. అయితే, వెండి ధరలో మార్పు లేదు. దీంతో హైదరాబాద్ లో కేజీ వెండి ధర 46,700 వద్ద నిలింది.
ఇక్కడ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 39,220 రూపాయలు, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 36,220 రూపాయలుగా నమోదయ్యాయి.
కాగా, ఢిల్లీ మార్కెట్ లో కూడా బంగారం ధరలు కాస్త పెరిగాయి. ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం 300 రూపాయలు పెరిగి 38,200 రూపాయల వద్దకు చేరుకుంది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 300 రూపాయలు పెరిగి 37,000 రూపాయల వద్ద ఉంది. ఇక వెండి ధర ఇక్కడా స్థిరంగా ఉంది. దీంతో వెండి కేజీకి 46,700 రూపాయల వద్ద నిలిచింది.
ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 15.12.2019 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా..దేశీయంగా వాణిజ్య విపణిలో బంగారం..వెండి ధరలు ఎప్పటికప్పుడు మర్పులకుగురవుతుంటాయి. వాటి ఆధారంగా ధరల్లో స్థానికంగా హెచ్చుతగ్గులు ఉండవచ్చును.