మరింత తగ్గిన బంగారం. వెండిదీ అదే దారి!

బంగారం, వెండి ధరలు ఈరోజూ (12-12-2019) తగ్గాయి.

Update: 2019-12-12 05:04 GMT

ఈరోజు బంగారం ధరలు మరింత తగ్గాయి. మరోవైపు వెండి ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి. గురువారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 40 రూపాయలు తగ్గి 39,170 రూపాయల వద్దకు దిగి వచ్చింది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 30 రూపాయలు తగ్గి 35,910 రూపాయల వద్దకు చేరింది. అయితే, వెండి ధరలు కూడా ఈరోజు కేజీకి 90 రూపాయలు తగ్గాయి. దీంతో హైదరాబాద్ లో కేజీ వెండి ధర 47,400 వద్దకు చేరింది.

విజయవాడ, విశాఖపట్నంలలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 39,170 రూపాయలు, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 35,910 రూపాయలుగా నమోదయ్యాయి.

కాగా, ఢిల్లీ మార్కెట్ లో బంగారం ధరలు నిలకడగా  ఉన్నాయి. ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం  37,900 రూపాయల వద్దకు చేరుకుంది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర  36,700 రూపాయల వద్ద ఉంది. ఇక వెండి ధర ఇక్కడా కేజీకి 90 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో వెండి కేజీకి 47,400 రూపాయల వద్దకు చేరింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 12.12.2019 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా..దేశీయంగా వాణిజ్య విపణిలో బంగారం..వెండి ధరలు ఎప్పటికప్పుడు మర్పులకుగురవుతుంటాయి. వాటి ఆధారంగా ధరల్లో స్థానికంగా హెచ్చుతగ్గులు ఉండవచ్చును.


Tags:    

Similar News