భగ్గుమన్న బంగారం.. వెండిదీ అదేదారి!

Update: 2020-01-09 03:35 GMT

నిన్న కాస్త ఉపశామించినట్టు కనిపించిన  బంగారం ఈరోజు మళ్ళీ భగ్గుమంది. ఒక్కసారిగా భారీగా పెరిగిపోయింది. ఈరోజు (09. 01.2020) బంగారం ధరలు కొండెక్కి కూచున్నాయి. అదే విధంగా నిన్న బంగారం తో పాటు తగ్గినట్టు కనిపించిన వెండి ధరలు ఈరోజు పైకెగాశాయి.

హైదరాబాద్ మార్కెట్లో గురువారం బంగారం ధరలు బుధవారం ధరలతో పోలిస్తే భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం పది గ్రాములకు ఏకంగా 880 రూపాయలు పెరిగింది. దీంతో 24 క్యారెట్ల బంగారం పది గ్రాములకు 42,860 రూపాయలకు ఎగసింది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా అదేస్థాయిలో పెరుగుదల నమోదు చేసింది. పది గ్రాములకు 840 రూపాయలు పెరగడంతో 39,270 రూపాయల వద్దకు చేరుకుంది. ఇక వెండి ధరలు కూడా కేజీకి 250 రూపాయలు పెరిగాయి. దీంతో కేజీ వెండిధర 51,000 రూపాయలకు చేరుకుంది.

విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు అదేవిధంగా ఉన్నాయి. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 42,860 రూపాయలు, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 39,270 రూపాయలుగా నమోదయ్యాయి.

కాగా, ఢిల్లీ మార్కెట్ లో కూడా బంగారం ధరలు పైకెగాశాయి. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ఇక్కడా 840 రూపాయలు పెరిగింది. దీంతో ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం 41,280 రూపాయల వద్దకు చేరుకుంది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 850 రూపాయల పెరుగుదల  నమోదు చేసి 40,100 రూపాయలకు చేరింది. ఇక వెండి ధర ఇక్కడా కేజీకి 250 రూపాయలు పెరిగింది. దాంతో వెండి ధర కేజీకి 51,100 రూపాయలుగా ఉంది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 09.01.2020 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా..దేశీయంగా వాణిజ్య విపణిలో బంగారం..వెండి ధరలు ఎప్పటికప్పుడు మార్పులకు గురవుతుంటాయి. వాటి ఆధారంగా ధరల్లో స్థానికంగా హెచ్చుతగ్గులు ఉండవచ్చును.


Tags:    

Similar News