కొద్దిగా తగ్గిన బంగారం..పెరిగిన వెండి ధరలు

నిన్న నిలకడగా ఉన్న బంగారం ధరలు కొద్దిగా తగ్గాయి. మరోవైపు వెండి ధరలు కొద్దిగా పెరిగాయి. 08.12.2019 ఆదివారం పది గ్రాముల

Update: 2019-12-08 03:10 GMT
Gold and silver rates today in india

నిన్న నిలకడగా ఉన్న బంగారం ధరలు కొద్దిగా తగ్గాయి. మరోవైపు వెండి ధరలు కొద్దిగా పెరిగాయి. 08.12.2019 ఆదివారం పది గ్రాముల బంగారం ధర శనివారం ధరలతో పోలిస్తే 50 రూపాయలవరకూ తగ్గింది. వెండి ధరలు కేజీకి 100 రూపాయల వరకూ పెరిగాయి.

శనివారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 50రూపాయలు తగ్గి 39,720 రూపాయలకు చేరుకుంది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 70రూపాయలు తగ్గి 36,410 రూపాయలకు చేరింది. ఇక వెండి ధరలు ఈరోజు కొద్దిగా పెరిగాయి. దీంతో హైదరాబాద్ లో కేజీ వెండి ధర 100 రూపాయలు పెరిగి 47,500 వద్దకు చేరింది.

విజయవాడ, విశాఖపట్నంలలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 39,720 రూపాయలు, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 36,410 రూపాయలుగా నమోదయ్యాయి. కాగా, ఢిల్లీ మార్కెట్ లో కూడా బంగారం ధరలు దిగివచ్చాయి. ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం 50 రూపాయలు తగ్గాయి. దీంతో 38,400 రూపాయల వద్దకు చేరుకుంది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 50 రూపాయలు తగ్గడంతో 37,200 రూపాయల వద్దకు చేరింది. ఇక వెండి ధర కేజీకి 100 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో వెండి కేజీకి 47,500 రూపాయలకు చేరింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 08.12.2019 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా..దేశీయంగా వాణిజ్య విపణిలో బంగారం..వెండి ధరలు ఎప్పటికప్పుడు మర్పులకుగురవుతుంటాయి. వాటి ఆధారంగా ధరల్లో స్థానికంగా హెచ్చుతగ్గులు ఉండవచ్చును. 

Tags:    

Similar News