Gold Rate: మెరిసిన బంగారం..తగ్గిన వెండి ధరలు

Update: 2021-07-21 02:49 GMT

బంగారం మరియు వెండి ధరలు

Gold Rate: పసిడి ప్రియులకి షాక్. మరోసారి పెరిగిన పసిడి ధరలు. బంగారం ధరలు ఒకవైపు పెరుగుతుంటే మరోవైపు వెండి ధరలు నేలవైపు చూస్తున్నాయి. హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం బంగారం ధర మళ్ళీ పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.280 పైకి కదిలింది. దీంతో బంగారం ధర రూ.49,370కు చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో పయనించింది. రూ.250 పెరుగుదలతో రూ.45,250కు చేరింది. ఇక ఒక వైపు బంగారం ధర పెరిగితే..ఇక మరోవైపు వెండి రేటు మాత్రం పడిపోయింది. హైదరాబాద్‌లో వెండి రేటు రూ.600 దిగొచ్చింది. దీంతో కేజీ వెండి ధర రూ.72,300కు తగ్గింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గింది. 0.24 శాతం దిగొచ్చింది. దీంతో పసిడి రేటు ఔన్స్‌కు 1807 డాలర్లకు క్షీణించింది. వెండి కూడా ఇదే దారిలో పయనించింది. ఔన్స్‌కు 0.34 శాతం తగ్గుదలతో 24.90 డాలర్లకు పడిపోయింది.

Tags:    

Similar News