Gold Rate Tody : భారీగా తగ్గుతున్న బంగారం ధర, మే రెండవ తేదీ ధరలు ఇవే... తులం పసిడి ఏకంగా 95 వేలకు పతనం..
Gold Rate Today: భారీగా తగ్గుతున్న బంగారం ధరలు..మే 14వ తేదీ బంగారం ధరలు ఇవే..!!
Gold Rate Tody : మే 2వ తేదీ శుక్రవారం బంగారం ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 95700 పలికింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 88040 పలికింది. ఒక కేజీ వెండి ధర. రూ. 96800 పలికింది. బంగారం ధరలు తగ్గడానికి ప్రధానంగా అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాలే కారణంగా చెప్పవచ్చు.
పసిడి ధరలు గడచిన 4 రోజులుగా తగ్గుతూ వస్తున్నాయి. బంగారం ధరలు తగ్గడానికి అమెరికా - చైనా మధ్య వాణిజ్య యుద్ధం తగ్గుముఖం పట్టడం కూడా ఒక కారణంగా చెబుతున్నారు. దీనికి తోడు అమెరికా స్టాక్ మార్కెట్లలో లాభాలు నమోదు అవుతున్నాయి ఈ కారణంగా కూడా బంగారం ధరలు తగ్గుతున్నాయి. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో లాభాలు ప్రారంభమైతే ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారం నుంచి ఉపసంహరించి స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడతారు. ఈ కారణంగా బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి.
బంగారం ధరలు గడచిన ఐదు సంవత్సరాలతో పోల్చి చూస్తే దాదాపు రెండింతలుగా మారాయి. ఈ నేపథ్యంలో బంగారం ధరలు సామాన్యులు కొనుగోలు చేయలేనంత ఎత్తుకు ఎదిగాయి. దీంతో రిటైల్ మార్కెట్లో కూడా విపరీతంగా డిమాండ్ తగ్గిపోయింది.ఇటీవల జరిగినటువంటి అక్షయ తృతీయ పర్వదినం రోజు బంగారం సేల్స్ పెద్దగా జరగలేదు. దీంతో డిమాండ్ లేకపోయినా కారణంగా బంగారం ధరలు తగ్గక తప్పని పరిస్థితి ఏర్పడింది. అటు అమెరికా డాలర్ కూడా బలం ఉంచుకోవడం కారణంగా కూడా బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి.
నిజానికి అమెరికా డాలర్ బలం పెరిగితే బంగారం ధర తగ్గుతుంది ఎందుకంటే ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను అమెరికా జారీ చేసే ట్రెజరీ బాండ్లలో పెట్టుబడి పెడతారు ఫలితంగా, బంగారంలో పెట్టుబడి పెట్టడంపై డిమాండ్ తగ్గి బంగారం ధరలు దిగి వస్తాయి. అయితే భవిష్యత్తులో బంగారం ధరలు పెరుగుతాయా లేక తగ్గుతాయా అనే సందేహం లేకపోలేదు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిణామాలను చూస్తున్నట్లయితే బంగారం ధరలు భవిష్యత్తులో కూడా అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగానే కదలాడే అవకాశం కనిపిస్తోంది.
మరోవైపు బంగారం ధరలు దిగివస్తున్న నేపథ్యంలో పసిడి ప్రియులు బంగారం కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించే అవకాశం ఉంటుంది. అయితే నిపుణులు మాత్రం బంగారం ధర తగ్గినప్పుడల్లా కొనుగోలు చేయవచ్చని సూచిస్తున్నారు. అయినప్పటికీ బంగారం ధర భవిష్యత్తులో మాత్రం పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం బంగారం పెరుగుదలకు కాస్త రిలీఫ్ వచ్చినప్పటికీ, దీర్ఘ కాలికంగా మాత్రం బంగారం ధరలు పెరిగే అవకాశం ఉందని ఇన్వెస్టర్లు ఆచితూచి అడుగు వేయాలని సూచిస్తున్నారు.