Gold Rate Today: పసిడి ప్రియులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన బంగారం ధర.. తులం గోల్డ్ మరోసారి లక్ష దాటేసింది
Gold Rate Today: భారీగా పెరిగిన బంగారం ధర.. తులంపై 3,800పెరిగిన పసిడి.. ఇలా అయితే కొనడం కష్టమే
Gold Rate Today: బంగారం ధరలు ఆల్ టైం రికార్డు స్థాయిని దాటి ముందుకు దూసుకు వెళ్తున్నాయి. మే 8వ తేదీ గురువారం బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,00,600 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 91150గా ఉంది. ఒక కేజీ వెండి ధర రూ. 98411గా ఉంది.
పసిడి ధరలు భారీగా పెరగడానికి ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర భారీగా పెరగడమే అని చెప్పవచ్చు. ఒక ఔన్స్ బంగారం ధర మరో సారి 3400 డాలర్లకు చేరింది. ఈ కారణంగా దేశీయంగా కూడా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. దీనికి తోడు అమెరికా స్టాక్ మార్కెట్లలో సైతం ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్ల పైన ఆందోళన నెలకొని ఉంది.
ఈ కారణంగా ఇన్వెస్టర్లు తమ సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారంలో పెట్టుబడి పెట్టేందుకు మళ్ళీ ఆసక్తి చూపిస్తున్నారు ఫలితంగా బంగారం ధరలు పెరగడం ప్రారంభించాయి. అయితే అమెరికా చైనా మధ్య ప్రస్తుతం వాణిజ్య ఒప్పందం జరిగే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది ఒకవేళ ఇది జరిగితే మాత్రం బంగారం ధరలు తగ్గి వస్తాయి అని నిపుణులు అంచనా వేస్తున్నారు.
బంగారం ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో ప్రస్తుతం వివాహ సీజన్లో పసిడి ప్రియులకు ఇబ్బందికరంగా మారింది అని చెప్పవచ్చు. ఎందుకంటే భారతీయ ఇళ్లల్లో వివాహం అనగానే బంగారం గుర్తుకు వస్తుంది. బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో పసిడి అభరణాల ధరలు భారీగా పెరగడంతో బంగారం కొనాలంటేనే షాక్ అయ్యే పరిస్థితి ఏర్పడింది.
మరోవైపు భవిష్యత్తులో బంగారం ధరలు తగ్గుతాయా లేక పెరుగుతాయా అనేది తేలక చాలామంది పసిడి ప్రియులు ఆందోళన చెందుతున్నారు. అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్లో ఏమాత్రం తేడా వచ్చిన ఇన్వెస్టర్లు వెంటనే బంగారం లో పెట్టుబడి పెడుతున్నారు.
దీంతో ఒక్కసారిగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి వాణిజ్యయుద్ధ పరిస్థితులు సద్దుమణిగినట్లయితే మాత్రం బంగారం ధరలు తగ్గే అవకాశం ఉందని, నిపుణులు అంచనా వేస్తున్నారు. అప్పటివరకు బంగారం ధరలు హెచ్చుతగ్గులకు లోనయ్యే అవకాశం ఉంటుంది.