Gold Rate Today: పసిడి ప్రియులకు బిగ్ అలర్ట్..భారీగా తగ్గిన బంగారం ధర
Gold Rate Today: శనివారం హైదరాబాద్ లో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 89,800 ఉంది. పది గ్రాముల 24క్యారెట్ల పసిడి ధర రూ. 97, 970 ఉంది. పది గ్రాముల 18 క్యారెట్ల గోల్డ్ రేట్ 73,480దగ్గర ట్రేడ్ అయ్యింది.
Gold Rate Today: పసిడి ప్రియులకు బిగ్ అలర్ట్..భారీగా తగ్గిన బంగారం ధర
Gold Rate Today: పసిడి ప్రియులకు బిగ్ న్యూస్. బంగారం ధరలు మెల్లిగా దిగివస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పడిపోతున్నాయి. ఆ ప్రభావంతో భారత్ లో కూడా బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. గత కొన్ని రోజుల నుంచి పెరుగుతున్న బంగారం ధరలు శనివారం తగ్గాయి. గత నెల మొదట్లో లక్ష రూపాయల వద్ద ట్రేడ్ అయిన స్వచ్చమైన బంగారం ధర ఇప్పుడు 97వేల వద్ద ట్రేడ్ అవుతోంది. బంగారం కొనాలనుకునేవారికి ఇదే మంచి ఛాన్స్ అని చెప్పవచ్చు. భవిష్యత్తులో మళ్లీ బంగారం ధరలు ఆకాశాన్ని తాకే అవకాశం ఉంది.
శనివారం హైదరాబాద్ లో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 89,800 ఉంది. పది గ్రాముల 24క్యారెట్ల పసిడి ధర రూ. 97, 970 ఉంది. పది గ్రాముల 18 క్యారెట్ల గోల్డ్ రేట్ 73,480దగ్గర ట్రేడ్ అయ్యింది. అయితే ఈ రోజు ఆదివారం బంగారం ధరలు నిలకడగానే ఉన్నాయి. పెరగలేదు అలాని తగ్గలేదు. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 97,970 రూపాయల దగ్గర ఉండగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 89, 800 వద్ద ఉంది. పది గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ. 73,480 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది.
అటు వెండి ధరలు కూడా స్థిరంగానే పెరుగుతూ వెళ్తున్నాయి. బంగారం ధరలతో సంబంధం లేకుండా వెండి ధరలు దూసుకెళ్తున్నాయి. శనివారం హైదరాబాద్ లో వంద గ్రాముల వెండి ధర రూ. 10,700 వద్ద ట్రేడ్ అయ్యింది. కిలో వెండి ధర 1, 70, 000 దగ్గర ట్రేడ్ అయ్యింది. బంగారం వలే ఈ రోజు వెండి ధరలు కూడా స్థిరంగానే ఉన్నాయి.