Gold Rate Today: మళ్లీ పెరిగిన బంగారం ధర... పసడి, వెండి ధరలు ఎంతకు చేరాయంటే?

Update: 2025-02-08 02:30 GMT

Gold Rate Today: సామాన్యులకు బంగారం, వెండి ధరలు భారీగా షాక్ ఇస్తున్నాయి. కొనుగోలు చేయాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఎందుకంటే గత వారం రోజుల్లోనే వీటి ధరలు ఏకంగా 5వేల రూపాయలకు పైగా పెరిగాయి. ఇవాళ్టి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

దేశంలో బడ్జెట్ 2025 తర్వాత బంగారం, వెండి ధరలు క్రమంగా పైపైకి చేరుకుంటున్నాయి. దీనికి ముందు బులియన్ మార్కెట్లో 80వేల లోపు ఉన్న పసిడి ధరలు, ఇప్పుడు 85వేలు దాటి దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలోనే నేడు 24క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 85,210కి చేరుకుంది. 22క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 78, 109కి చేరింది.

ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 84,710కి చేరుకుంది. 22క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 77,651కు చేరుకుంది. ఇదే సమయంలో హైదరాబాద్, విజయవాడలోనూ పది గ్రాముల బంగారం 24క్యారెట్లకు రూ. 84,990గా ఉంది. 22క్యారెట్ల బంగారం ధర రూ 77,908కి చేరింది.

ఇక వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 95,300కి చేరుకుంది. హైదరాబాద్ విజయవాడలో కిలో వెండి ధర రూ. 95,610కి చేరుకుంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో 22 క్యారెట్, 24 క్యారెట్ బంగారం ధరలు

చెన్నైలో రూ. 78,008, రూ. 85,100

ముంబైలో రూ. 77,779, రూ. 84,850

కోల్‌కతాలో రూ. 77,678, రూ. 84,740

బెంగళూరులో రూ. 77,843, రూ. 84,920

మధురైలో రూ. 78,008, రూ. 85,100

మణిపూర్‌లో రూ. 78,109, రూ. 85,210

ఢిల్లీలో రూ. 77,651, రూ. 84,710

హైదరాబాద్‌లో రూ. 77,908, రూ. 84,990

విజయవాడలో రూ. 77,908, రూ. 84,990

పాట్నాలో రూ. 77,743, రూ. 84,810

Tags:    

Similar News