Gold Rate Today: భారీగా పెరిగిన బంగారం ధర.. మరోసారి లక్షల దాటిన తులం పసిడి

Update: 2025-05-07 05:38 GMT

 Gold Rate Today: స్థిరంగా బంగారం, వెండి ధరలు.. నేడు మే 18వ తేదీ ఆదివారం ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today: నేడు మే 7వ తేదీ బుధవారం బంగారం ధరలు మరోసారి భారీగా పెరిగాయి. తులం బంగారం ధర మరోసారి లక్ష రూపాయలు దాటింది. బంగారం ధరలు పెరగడానికి ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లలో పరిస్థితులే ధరలు పెరగడానికి కారణం అని చెప్పవచ్చు. దీనికి తోడు దేశీయంగా భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. భారత వైమానిక దళం పాకిస్తాన్ లో ఉగ్రవాద శిబిరాలపై అపరేషన్ సింధూర్ పేరుతో వైమానిక దాడులతో విరుచుకుపడింది. దీంతో ఒక్కసారిగా బంగారం ధర పెరిగింది.

కాగా నేడు 24క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1, 00, 070 పలుకింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 90, 650 పలుకుతోంది. కిలో వెండి ధర రూ. 98, 591 పలుకుతోంది. బంగారం ధరలు నేడు భారీగా పెరిగాయి. మరోసారి లక్ష దాటింది. బంగారం ధరలు భారీగా పెరుగుతుండటంతో పసిడి ప్రియులు ఆందోళన చెందుతున్నారు. అంతర్జాతీయంగా బంగారం ధరలు భారీగా పెరగడంతో ఒక్కసారిగా దేశీయంగా కూడా పెరిగాయి. అమెరికాలో ఒక ట్రాయ్ ఔన్స్ బంగారం ధర 3400 డాలర్లు దాటిపోయింది. దీంతో ఒక్కసారిగా బంగారం ధరలు భారీగా పెరిగాయి.

Tags:    

Similar News