Gold Rate Today: దేశంలో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. బంగారం కొనాలంటేనే జనాలు భయపడుతున్నారు. ఈ పెరుగుదల అంతర్జాతీయ మార్కెట్లలో మార్పులు, స్థానిక డిమాండ్, ఆర్థిక పరిస్థితులతో ముడిపడి ఉంది. ముఖ్యంగా పెళ్లిళ్లు, పండుగల సీజన్‌లో బంగారం డిమాండ్ మరింత పెరుగుతుంది. ఈ పెరిగిన ధరల ప్రభావం అన్ని ప్రధాన నగరాల్లో కనిపిస్తోంది. దేశంలోని వివిధ నగరాల్లో ఈరోజు బంగారం ధర ఎంత ఉందో, గ్రాముకు బంగారం ధర ఎంత ఉందో తెలుసుకుందాం.
ఢిల్లీలో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 85,350, అంటే రూ. 1,150 పెరిగింది. అదే సమయంలో, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.78,250 గా ఉంది, దీనిలో రూ. 1,050 పెరుగుదల నమోదైంది. ముంబైలో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 85,200 గా ఉంది, రూ. 1,150 పెరిగింది. అదే సమయంలో, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 78,100 గా ఉంది, దీనిలోరూ. 1,050 పెరుగుదల నమోదైంది. హైదరాబాద్ 10 గ్రాముల బంగారం 22 క్యారెట్ల ధర రూ. 77,040గా ఉంది. 24క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 84,040 పలుకుతోంది.
బంగారం బాటలోనే వెండి కూడా పయనిస్తోంది. దేశీయంగా నేటి వెండి ధర గ్రాము రూ. 106.90 ఉంది. కిలో రూ. 1,06,900లుగా ఉంది. హైదరాబాద్ లో నేటి వెండి ధర గ్రాము రూ. 106.90లు ఉండగా..కిలో వెండి ధర రూ. 1,06,900 ఉంది.