Gold Rate Today: బంగారం ప్రియులకు అలర్ట్.. మళ్లీ షాకిచ్చిన పసిడి ధరలు..!!

Update: 2025-06-04 03:15 GMT

Gold Rate Today: బంగారం ప్రియులకు అలర్ట్.. మళ్లీ షాకిచ్చిన పసిడి ధరలు..!!

Gold Rate Today: బంగారం కొనాలని చూస్తున్నారా. అయితే గత కొద్ది రోజులుగా తగ్గినట్లే కనిపించినా..మళ్లీఇప్పుడు జూన్ నెలలో భారీగా పుంజుకున్నాయి. మరోసారి ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకుంటున్నాయి. తులం బంగారం ధర త్వలోనే లక్షరూపాయలు దాటే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం దేశీయ, అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

దేశీయంగా బంగారం ధరల విషయానికి వస్తే..హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 200 పెరగడంతో తులం ధర రూ. 90,800కు చేరుకుంది. దీనికి ముందు రోజు ఏకంగా రూ. 1400 పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర రూ. 220 పెరిగి 10 గ్రాములకు రూ. 99, 060 మార్క్ వద్ద కొనసాగుతోంది. మరోవైపు వెండి ధరలు చూస్తే స్వల్పంగా రూ. 100 పెరిగింది. హైదరాబాద్ లో కిలో వెండి ధర రూ. 1,11,100 వద్ద ఉంది. గత కొద్ది రోజులుగా వెండి ధరలు పెద్దగా తేడా ఏం లేదు.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల ఉక్కు, అల్యూమినియంఉత్పత్తులపై దిగుమతి సుంకాలను ప్రస్తుతం ఉన్నటువంటి 25శాతం నుంచి డబుల్ చేసి ఏకంగా 50శాతానికి చేర్చడంతో మరోసారి అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితి నెలకొంది. వాణిజ్య యుద్ధ భయాలు మళ్లీ పెరిగాయి. ఈ క్రమంలో సురక్షిత పెట్టుబడి సాధనంగా మరోసారి బంగారానికి డిమాండ్ భారీగా పెరిగింది. పెట్టుబడులు పెరగడంతో బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో మరోసారి బంగారం ధర లక్ష మార్కను తాకే అంచనాలు ఉన్నాయి.

Tags:    

Similar News