Gold Rate Today: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు, బంగారం ధరలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. కెనడా, మెక్సికో,చైనా ఉత్పత్తులపై టారిఫ్ లు ప్రకటించిన ట్రంప్..తదుపరి మెక్సికోకు మాత్రం విరామం కల్పించారు. అమెరికా వస్తువులపై పన్ను విధిస్తామని కెనడా ప్రకటించిగా..చైనా కూడా ప్రతిస్పందించనున్న నేపథ్యంలో సోమవారం అమెరికా సహా ప్రపంచవ్యాప్త స్టాక్ మార్కెట్లు నష్టపోయాయి. అనిశ్చితి పరిస్థితుల్లో ఆర్థికంగా భరోసా ఇచ్చే బంగారంపై పెట్టుబడులు మళ్లడంతో అంతర్జాతీయ విపణిలో బంగారం ధర భారీగా పెరిగింది. డాలర్ విలువ రూ. 87.11కు చేరింది. దేశీయంగా బంగారం ధర పెరుగుదల మరింత అధికంగా ఉంది. హైదరాబాద్ బులియన్ విపణిలో 10 గ్రాముల మేలిమి బంగారం ధర తొలిసారిగా సోమవారం రూ. 86వేలు తాకింది. అంతర్జాతీయంగా ఔన్సు ధర 2,829.57డాలర్లకు చేరింది. అయితే తదుపరి కొంత లాభాల స్వీకరణతో రాత్రి 11.30గంటల సమయానికి
ఔన్సు బంగారం ధర 2820 డాలర్లకు దిగి రావడంతో..హైదరాబాద్ బులియన్ విపణిలోనూ రూ. 85,880 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇది కూడా ఇప్పటి వరకు బంగారానికి గరిష్ట స్థాయే అని చెప్పవచ్చు. జనవరి 30న తొలిసారి 10గ్రాముల మేలిమి బంగారం ధర రూ. 84వేలకు మరుసటి రోజు రూ. 85వేలకు, సోమవారం 86వేలకు చేరింది. దీంతో కొనుగోలు దారులు బంగారం కొనుగోలు చేయాలంటే జంకుతున్నారు. కిలో వెండి ధర రూ. 96,400దగ్గర ట్రేడ్ అవుతోంది.